BRS Corporator Dedeepya Rao : బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ ఫై దాడి..
- By Sudheer Published Date - 01:45 PM, Wed - 13 March 24

వెంగళరావు నగర్ కార్పొరేటర్, బిఆర్ఎస్ పార్టీ నేత దేదీప్య ( BRS corporator Dedeepya Rao) పై దాడి జరిగింది. మంగళవారం రాత్రి దేదీప్య కారులో వెళ్తుండగా కొందరు మహిళలు అడ్డుకుని ఆమెపై దాడికి దిగారు. ఈ సంఘటనలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు వాపోతున్న సంగతి తెలిసిందే.
పోలీసులు సైతం పెద్దగా పట్టించుకోవడం లేదని , దాడులు చేస్తున్నారని చెప్పిన కేసులు నమోదు చేయడం లేదని చెపుతున్నారు. తాజాగా మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సైతం నిన్న కరీంనగర్ లో జరిగిన సభలో పోలీసులను హెచ్చరించారు. ప్రభుత్వాలు ఎప్పుడు శాశ్వతం కాదని , గుర్తుపెట్టుకొని ప్రవర్తించాడని సూచించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరం నడిబొడ్డున బీఆర్ఎస్ మహిళ కార్పొరేటర్ పై విచక్షణ రహితంగా దాడి ఘటన చోటుచేసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
వెంగళరావు నగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య రావు , ఆమె భర్త కారులో ప్రయాణం చేస్తున్న క్రమంలో, ఒక్కసారిగా మహిళలు కారును అడ్డుకొని దేదీప్య రావు పై దాడి చేశారు. విచక్షణారహితంగా మహిళలు ఆమెను కొట్టారు. దీంతో ఆమె స్వల్ప గాయాల పాలయ్యారు. కారులో ఉన్న దేదీప్య రావు భర్త ఎంత వారించినప్పటికీ ఆగకుండా మహిళలు దాడికి పాల్పడ్డారు. అయితే జూబ్లీహిల్స్ లో చోటు చేసుకున్న ఫ్లెక్సీల వివాదమే దీనికి కారణమని, కాంగ్రెస్ నాయకుల అండతోనే బిఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య రావుపై మహిళలు దాడి చేశారని ఆమె భర్త విజయ్ ముదిరాజ్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య రావు పై మహిళలు దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ BRS కార్పొరేటర్ దేదీప్య రావు పై దాడి. pic.twitter.com/uZwzHKxq6E
— Telugu Scribe (@TeluguScribe) March 13, 2024
Read Also : Bengaluru : మహిళపై బస్సు కండక్టర్ లైంగిక వేదింపులు..