Bengaluru : మహిళపై బస్సు కండక్టర్ లైంగిక వేదింపులు..
- By Sudheer Published Date - 01:33 PM, Wed - 13 March 24

సమాజంలో మహిళల (Womensపై లైంగిక వేదింపులు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. ఒంటరి మహిళా కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. కొంతమంది కోర్కెలు తీర్చమని , మరికొంతమంది ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. పోలీసులు , కోర్ట్ లు ఎన్ని చట్టాలు తీసుకొచ్చి , ఎన్ని కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ వారు మాత్రం మారడం లేదు. తాజాగా మహిళపై బస్సు కండక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన బెంగళూరు సిటీ లో చోటుచేసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
రాయచూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ మహిళపై కండక్టర్ వేధింపులకు పాల్పడ్డాడు. రాయచూర్ సిటీ యూనిట్ కండక్టర్ (Raichur City Unit Conductor) లక్ష్మీకాంత్‌రెడ్డి (Laxmikant Reddy) బస్సులో లైట్ ఆఫ్ చేసి వేధించాడు. డ్రైవర్ సీటు వెనుక ఓ మహిళ ప్రయాణిస్తోంది. పక్క సీటులో కూర్చున్న కండక్టర్ మహిళ ప్రైవేట్ పార్ట్‌ను తాకి వేధించి బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఉచిత టికెట్ కావాలంటే నాకు సహకరించాలని, లేకుంటే జరిమానా విధిస్తానని బెదిరించాడని మహిళ ఆరోపించింది. సదరు మహిళా డివిజన్ అధికారులకు ఫిర్యాదు చేయగా, నేను తనను వేధించలేదని చెప్పుకొచ్చారు. అయితే కండక్టర్ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కండక్టర్లు ఉంటే బస్సులో మహిళలు ఒంటరిగా ఎలా ప్రయాణిస్తారు..? అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోండి అని కోరుతున్నారు.
Read Also : Khammam: జలగం చేరికతో ఖమ్మం బీజేపీ ఎంపీ సీటు ఆశావహుల్లో పోటీ