J&K’s Poonch: జమ్మూలోని పూంచ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదుల సంచారం, అలర్ట్ అయిన బలగాలు
కథువా, దోడా, రియాసి, పూంచ్ మరియు రాజౌరీలలో జరిగిన ఆకస్మిక దాడుల తర్వాత జమ్మూలో భద్రత బలగాలు సీరియస్ యాక్షన్ మోడ్ లోకి వెళ్లారు. ఉగ్రవాదులను అంతమొందించేందుకు రాత్రింబవళ్లు కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో మంగళవారం అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినట్లు గుర్తించారు భద్రత బలగాలు.
- By Praveen Aluthuru Published Date - 02:30 PM, Tue - 30 July 24

J&K’s Poonch: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో మంగళవారం అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినట్లు గుర్తించారు భద్రత బలగాలు. దీంతో జిల్లాలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సమాచారం అందిందని అధికారులు తెలిపారు. అనంతరం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
సోమవారం అర్థరాత్రి డెహ్రా గలి సమీపంలోని సలంపుర గ్రామంలో ఇద్దరు సాయుధ అనుమానితులు నల్లటి దుస్తులు ధరించి సంచరిస్తున్నట్లు సమాచారం.సమాచారం అందుకున్న పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్ సహాయంతో జాయింట్ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. లోయర్ పంగై ప్రాంతం వైపు అనుమానిత ఉగ్రవాదులు కదులుతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు అనుమానిత ఉగ్రవాదుల జాడ తెలియరాలేదు. ఈ ఉదయం కూడా భద్రతా బలగాలు పూంచ్‌లోని సురన్‌కోట్ ప్రాంతంలోని సనాయ్, జంగల్, పట్టాన్ మరియు కిష్త్వార్ జిల్లాలోని ద్రాబ్‌షల్లా ప్రాంతంలోని బంగర్-సరూర్ అడవుల్లోని చుట్టుపక్కల గ్రామాలలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
జమ్మూ డివిజన్‌లోని కొండ జిల్లాల నుండి ఉగ్రవాదులను అంతమొందించడానికి సైన్యం ఇప్పటికే నాలుగు వేల మందికి పైగా సైనికులను మోహరించింది. ఇందులో శిక్షణ పొందిన ఎలైట్ కమాండోలు మరియు పర్వత యుద్ధంలో శిక్షణ పొందిన కమాండోలు ఉన్నారు.కథువా, దోడా, రియాసి, పూంచ్ మరియు రాజౌరీలలో జరిగిన ఆకస్మిక దాడుల తర్వాత ఈ జిల్లాల్లో 40-50 మంది హార్డ్‌కోర్ విదేశీ ఉగ్రవాదుల ఉనికిని ధృవీకరించిన నివేదికల తర్వాత ఈ చర్య తీసుకోబడింది.
Also Read: Arudra Nakshatra : ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఎలా ఉంటారో తెలుసా ?