Kavitha : ఈడీ కేసులో కేటీఆర్.. అలా జరిగితే కారు స్టీరింగ్ కవితకే !?
ఇంతకుముందు వరకు ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొన్నారు.
- By Pasha Published Date - 01:55 PM, Sun - 29 December 24

Kavitha : ఫార్ములా ఈ కార్ రేస్ కేసు దర్యాప్తు వేగాన్ని పుంజుకుంది. దీంతో బీఆర్ఎస్ హైకమాండ్ అలర్ట్ మోడ్‌లోకి వచ్చింది. అన్నీ తానై పార్టీని ముందుకు నడిపిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుండటంతో.. అందుకు అనుగుణంగా గులాబీ బాస్ కేసీఆర్ ఫ్యూచర్ ప్లాన్‌ను రెడీ చేస్తున్నారట. ఒకవేళ అనూహ్య పరిణామాలతో కేటీఆర్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లేదా తెలంగాణ ఏసీబీ అరెస్టు చేస్తే .. బీఆర్ఎస్‌ను ముందుకు తీసుకెళ్లే అంశంపై పక్కా ప్లాన్‌తో కేసీఆర్ ఉన్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇంతకుముందు వరకు ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొన్నారు. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ఢిల్లీలోని తిహార్ జైలులో ఆమె ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు యాక్టివ్ అయింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన స్కాంలను ఒక్కటొక్కటిగా బయటికి తీస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో ఆనాడు బీఆర్ఎస్ సర్కారు చేసుకున్న ఒప్పందాలలోని ఉల్లంఘనల ఆధారంగా కేసులు నమోదు చేసి ఏసీబీతో దర్యాప్తు చేయిస్తోంది. ఇప్పటిదాకా సేకరించిన ఆధారాలను ఈడీకి తెలంగాణ ఏసీబీ శనివారం రోజే అప్పగించింది. ఆ ఆధారాల ప్రాతిపదికన ఇటీవలే కేటీఆర్‌కు ఈడీ నోటీసులు సైతం పంపింది. జనవరి 7న విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌ను కోరింది.
Also Read :CR450 Bullet Train : చైనా దూకుడు.. ప్రపంచంలోనే స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ‘సీఆర్450’ రెడీ
గతంలో కవితను అరెస్టు చేసినట్టే.. ?
గతంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను విచారించే క్రమంలోనే ఈడీ అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లింది. ఈసారి కూడా అదే విధంగా కేటీఆర్‌ను ఈడీ అరెస్టు చేస్తే.. బీఆర్ఎస్ పగ్గాలను తాత్కాలికంగా కవితకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తన ఉద్యమ సంస్థ తెలంగాణ జాగృతితో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో కవిత చురుగ్గా పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ జాగృతి నాయకులతో ఎప్పటికప్పుడు ఆమె సమన్వయం చేసుకుంటున్నారు. పార్టీ పగ్గాలను అప్పగించినా.. కవిత నిర్వహించగలరని కేసీఆర్ నమ్ముతారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈవిషయంలో కవితకు సహకారాన్ని అందించేందుకు సీనియర్ నేత, ప్రజల మనిషి హరీశ్ రావు ఉండనే ఉన్నారు. కవితను కాదని.. హరీశ్ రావుకు పార్టీ బాధ్యతలను అప్పగించేందుకు కేసీఆర్ సాహసించకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.