HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Will Revanth Be Afraid Of Kcrs Warning

KCR Warning : కేసీఆర్ వార్నింగ్ కు రేవంత్ భయపడతాడా..?

KCR Warning : రేవంత్ ప్రభుత్వం (Revanth Govt) ఇచ్చిన ఎన్నికల హామీలు ఓ భారంగా మారుతుండడంతో, ప్రతి తప్పటడుగు బీఆర్ఎస్‌కు అవకాశంగా మారే అవకాశం ఉంది.

  • Author : Sudheer Date : 28-04-2025 - 6:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr Warning Revanth
Kcr Warning Revanth

ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభ (BRS Silver Jubilee Celebration) వేదికగా మాజీ సీఎం కేసీఆర్ (KCR) తన ఏడాదిన్నర రాజకీయ మౌనాన్ని చీల్చుతూ మళ్లీ ప్రజల మధ్యకు వచ్చారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, పోలీస్ అధికారులకు కూడా బలమైన హెచ్చరికలు పంపారు. అధికార పార్టీని భవిష్యత్తులో కఠినంగా ఎదుర్కొనే సంకేతాలు ఇస్తూ కేసీఆర్ తనదైన ధాటితో ప్రసంగించారు. ప్రత్యేకంగా కొత్త ప్రభుత్వానికి గడువు ఇచ్చామని, ఇక మౌనం వీడి, పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్నట్లు ప్రకటించారు.

Supreme Court : కేంద్రంతో సహా పలు ఓటీటీ, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు నోటీసులు

హైడ్రా ప్రాజెక్ట్, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం లాంటి విషయాల్లో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ తిరిగి రంగంలోకి రావడం తో రేవంత్ ప్రభుత్వం గట్టి ఒత్తిడిని ఎదుర్కొనబోతోంది. అయితే బీఆర్ఎస్ నిర్వహించిన సభకు భారీగా ప్రజలు తరలిరావడంతో ఇది ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిబింబిస్తుందా లేదా పార్టీకి ఉన్న మద్దతుని సూచిస్తుందా అన్నదానిపై రాజకీయ విశ్లేషణ కొనసాగుతోంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని వెలికితీయాలనే ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ చేస్తున్న తప్పిదాలను ప్రజల ముందుకు తీసుకురావాలని చూస్తోంది.

కేసీఆర్ కుటుంబం ఇప్పటికే వివిధ అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిలో ఉంది. కేటీఆర్ పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, కవితపై లిక్కర్ స్కాం కేసు, ఈ ఫార్ములా రేసింగ్ వ్యవహారాల వంటి ఘటనలు అధికార పక్షానికి బలం ఇస్తున్నప్పటికీ, కేసీఆర్ మళ్లీ ప్రజా మద్దతును సృష్టించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. రేవంత్ ప్రభుత్వం (Revanth Govt) ఇచ్చిన ఎన్నికల హామీలు ఓ భారంగా మారుతుండడంతో, ప్రతి తప్పటడుగు బీఆర్ఎస్‌కు అవకాశంగా మారే అవకాశం ఉంది. దీనితో బీఆర్ఎస్ ఓపికగా ఎదురు చూసి, సరైన సమయంలో దూకుడు చూపించే వ్యూహం రచిస్తోంది. మరి బిఆర్ఎస్ దూకుడు కు రేవంత్ ఇలా ఎదురుకుంటాడో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • KCR Speech
  • KCR Warning

Related News

Gandhi Sarovar Musi

Gandhi Sarovar : వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

గాంధీ సరోవర్ పరిసరాల్లో ఆధ్యాత్మికతను చాటేలా ఒక భారీ మసీదు నిర్మాణానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మసీదు నిర్మాణానికి సౌదీ అరేబియా యువరాజు సహకరించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం అందుతోంది.

  • Cm Revanth Vs Aravind

    CM Revanth : మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు

  • Cm Revanth Key Update On Fr

    Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • Cm Revanth Good News

    Free Electric Scooters: కాలేజీ అమ్మాయిలకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Latest News

  • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

  • కొత్త అవతారంలో సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ EX.. అదిరిపోయే ఫీచర్లు, కొత్త కలర్!

  • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందోచ్‌!!

  • రూ. 26,000 కోట్ల నెట్‌వర్త్.. SRH యజమాని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

Trending News

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd