HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Will Kcr Focus On The Parliamentary Elections And Give A Chance To The Sittings

KCR: పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్, సిట్టింగ్స్ లకు ఛాన్స్ ఇస్తారా!

  • By Balu J Published Date - 06:19 PM, Fri - 9 February 24
  • daily-hunt
Kcr Nallagonda
Kcr Nallagonda

KCR: ఎన్నికల్లో సిట్టింగ్‌లకు టికెట్‌ ఇచ్చిన కారణంగా ఓడిపోయామన్న భావనలో ఉన్న కేసీఆర్‌.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సిట్టింగులందరినీ పక్కకు పెట్టాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులకు టికెట్‌ ఇవ్వొద్దని విశ్లేషకులు పార్టీ నేతలు సూచించినా కేసీఆర్‌ ఎవరి మాట వినలేదు. దీంతో చివరకు పార్టీకి ఓటమి తప్పలేదు. ఈ సారి అలా జరగకుండా జాగ్రత్త పడుతున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ సిట్టింగులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై బీఆర్‌ఎస్‌ పార్టీ కసరత్తు మొదలు పెట్టింది. ఈమేరకు కేసీఆర్‌ ఇప్పటికే కొన్ని స్థానాల్లో ఎవరికి టికెట్‌ ఇవ్వాలని డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ

చివరి నిమిషంలో 12 స్థానాల్లో కొత్తవారిని నిలిపారు. అయితే ఆ ఎన్నికల్లో సిట్టింగుల్లో సగానికిపైగా ఓడిపోయారు. ఇక కొత్తగా ప్రకటించిన 12 మందిలో 10 మంది విజయం సాధించారు. ఈ నేపథ్యంలో సిట్టింగులకు టికెట్‌ ఇవ్వడం ఎంత పెద్ద తప్పో గులాబీ బాస్‌కు తెలిసి వచ్చింది. కానీ, అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్‌సభలో రిపీట్‌ కాకుండా కేసీఆర్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సిట్టింగులందరినీ పక్కన పెట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మంచి ఇమేజ్‌ ఉన్న సిట్టింగులకు టికెట్‌ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ 9 ఎంపీ సీట్లు గెలిచింది.

అందులో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలగా గెలిచారు. ఎంపీ సీటుకు రాజీనామా చేశారు. ఇక పెద్దపల్లి ఎంపీ మూడు రోజుల క్రితం కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు 8 మంది ఎంపీలే ఉన్నారు. వెంకటేశ్‌నేత రాజీనామా ఆమోదిస్తే ఆ బలం ఏడుకు తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఏవిధంగా వ్యవహరిస్తారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని పార్టీలు నాయకులు ఉత్కంఠతగా ఎదురుచూస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • hyderabad
  • kcr
  • Loksabha Elections 2024

Related News

Vasamsetti Subhash Kcr

Vasamsetti Subhash : తెలంగాణలో మా కులాన్ని అన్యాయం జరుగుతోంది: ఏపీ మంత్రి

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. శెట్టి బలిజలను ఓసీల్లో చేర్చి వారి జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఏపీలో కూడా శెట్జి బలిజల్ని ఓసీల్లో చేరుస్తారనే ప్రచారం జరుగుతోందని రెండు నెలల క్రితం మంత్రి ప్రస్తావించారు. అది వైఎస్సార్‌సీపీ నేతల అబద్ధపు ప్రచారమని తీవ్ర ఆగ్ర

  • Gold Rate

    Gold Price : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

  • Rajeev Swagruha Lands

    Rajeev Swagruha : రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి భారీ స్పందన

  • Saudi Bus Accident Update

    Saudi Bus Accident: 3 తరాలు బూడిద..ఆ తల్లి ఆవేదన అంత ఇంత కాదు !!

  • Divorce Case

    Divorce Cases : హైదరాబాద్ మరో ఘనత సాధించింది..!!

Latest News

  • AP Liquor Scam : మద్యం స్కాంలో కీలక పరిణామం.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్..!

  • Indiramma Sarees Scheme : తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది..!

  • Share Market : సీన్ రివర్స్.. భారీగా పెరిగి ఒక్కసారిగా గ్రో స్టాక్స్ లోయర్ సర్క్యూట్.!

  • Saras Baug Ganesh : చలి ఎఫెక్ట్.. స్వెటర్ వేసుకున్న గణపయ్య !!

  • SBI : ఎస్బీఐ ఆల్ టైమ్ హైకి షేర్ ధర.. రూ. 4 లక్షలొచ్చాయ్.!

Trending News

    • Maoists Encounter : మారేడుమిల్లి లో దేవ్‌జీ సహా ఏడుగురు మావోయిస్టులు హతం!

    • iBomma : ibomma రవి నెల సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    • Globetrotter Event: వార‌ణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్‌కు రాజ‌మౌళి ఎంత ఖ‌ర్చు పెట్టించారో తెలుసా?

    • PM Kisan Yojana: ఖాతాల్లోకి రేపే రూ. 2000.. ఈ పనులు చేయకపోతే డబ్బులు రావు!

    • IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఈ ఆటగాళ్లు వేలంలోకి ఎందుకు రాలేకపోతున్నారు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd