TGRTC : తెలంగాణ లో కూడా బస్సు ఛార్జ్ లు పెరుగుతాయా..?
ప్రభుత్వ బస్సుల్లో చార్జీల పెంపు అనేది అనివార్యమని కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్టీసీ) చైర్మన్ ఎస్‌ఆర్ శ్రీనివాస్ స్వయంగా తెలిపారు. బస్సు చార్జీలను 15-20 పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేఎస్‌ఆర్టీసీ ఇప్పటికే ప్రతిపాదనలు పంపిందని వెల్లడించారు
- By Sudheer Published Date - 03:20 PM, Mon - 15 July 24

తెలంగాణ (Telangana)లో బస్సు (BUS) ప్రయాణికుల ఫై భారం పడనుందా..? త్వరలోనే బస్సు ఛార్జ్ (Bus Charges Increase in Telangana ) లు పెంచే అవకాశం ఉందా..? అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే మామూలుగానే RTC అప్పుల్లో కూరుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ బస్సు పథకం తో మరింతగా అప్పుల్లో కూరుకుపోయింది. ఈ భారం నుండి బయటపడాలంటే టికెట్ ఛార్జ్ ల పెంచాల్సిందే. ఇప్పుడు పక్కనున్న కర్ణాటక రాష్ట్రం అదే చేయబోతుంది.
ప్రభుత్వ బస్సుల్లో చార్జీల పెంపు అనేది అనివార్యమని కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్టీసీ) చైర్మన్ ఎస్‌ఆర్ శ్రీనివాస్ స్వయంగా తెలిపారు. బస్సు చార్జీలను 15-20 పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేఎస్‌ఆర్టీసీ ఇప్పటికే ప్రతిపాదనలు పంపిందని వెల్లడించారు. ‘రెండు రోజుల క్రితం మా బోర్డు సమావేశం జరిగింది. బస్సు చార్జీలను 15-20 పెంచాలని మేం ప్రతిపాదనలు పంపాం. మిగతాది సీఎం సిద్ధరామయ్య విచక్షణపై ఆధారపడి ఉంటుంది. కేఎస్‌ఆర్టీసీ మనుగడ సాగించాలంటే, చార్జీల పెంపు తప్పనిసరి’ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇంధన, బస్సుల విడి పరికరాల ధరలు పెరిగాయని , 2019 నుంచి రాష్ట్రంలో చార్జీల పెంపు లేదని, అదేవిధంగా కేఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల సవరణ కూడా 2020 నుంచి జరుగలేదని, కాబట్టి టికెట్ ధరలను పెంచడం అవసరమని చెప్పుకొచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణ TGRTC కూడా అదే చేస్తుందని అంత భావిస్తున్నారు. కర్ణాటక లో ఎలాగైతే ఫ్రీ బస్సు పథకం తీసుకొచ్చారో..ఇక్కడ తెలంగాణ లో కూడా కాంగ్రెస్ అదే పని చేస్తుంది. దీంతో ఇక్కడ కూడా ఛార్జ్ లు పెరగడం ఖాయం అంటున్నారు. ఇదే విషయాన్నీ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ (KTR) చెప్పకనే చెప్పారు. ఉచితంగా ఇస్తామంటున్నారంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పందంటూ కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో బస్సు చార్జీల పెంపు ప్రతిపాదన జరిగింది. బస్సు చార్చీల పెంపుపై కర్ణాటకను తెలంగాణ అనుసరించే రోజు ఎంతో దూరంలో లేదని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
ఐదు గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల మోత మోగిస్తుంది. అనేక వాటిపై పన్నుల భారం మోపుతూ వస్తుంది. గైడెన్స్ వ్యాల్యూ ట్యాక్స్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, రవాణా వాహనాలపై అదనపు సెస్, ఈవీలపై లైఫ్ టైమ్ ట్యాక్స్‌ను ఇబ్బడిముబ్బడిగా వసూలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత నెలలో పెట్రోల్, డీజిల్‌పై సేల్స్ ట్యాక్స్‌ను దాదాపు 4 శాతం చొప్పున పెంచింది. ఇక పాల ధరలను కూడా లీటర్, అర లీటర్ ప్యాకెట్లపై రూ.2 చొప్పున కర్ణాటక మిల్క్ ఫెడరేషన్(కేఎంఎఫ్) పెంచింది. ఇప్పుడు ఆర్టీసీ ఛార్జ్ లు పెంచేందుకు సిద్ధమైంది. తెలంగాణ లో కూడా జరగబోతుంది. ఇదే జరిగితే ప్రజలు తిరగబడడం ఖాయం. ఇప్పటికే ప్రజలు ఆగ్రహం తో ఊగిపోతున్నారు..ఇప్పుడు బస్సు ఛార్జి లు కూడా పెంచితే ప్రజలు రోడ్లపైకి రావడం గ్యారెంటీ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also : Adani-Hindenburg Row: సుప్రీంకోర్టులో అదానీకి భారీ ఊరట