Hyderabad : బీర్‌బాటిళ్లతో భర్తను చంపేందుకు భార్య ప్లాన్
Hyderabad : కుత్బుల్లాపూర్ ప్రాంతంలో స్థానికంగా నివసించే జ్యోతి అనే మహిళ తన భర్త రాందాస్‌ను హత్యచేయాలని పథకం రచించిన ఘటన కలకలం రేపుతోంది
- By Sudheer Published Date - 07:33 AM, Mon - 28 July 25

దేశ వ్యాప్తంగా కొంతమంది మహిళల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. అక్రమ సంబంధాల మోజులో పడి కట్టుకున్న భర్తలను , కన్నబిడ్డలను చంపేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి రోజు వస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కుత్బుల్లాపూర్ ప్రాంతంలో స్థానికంగా నివసించే జ్యోతి అనే మహిళ తన భర్త రాందాస్‌ను హత్యచేయాలని పథకం రచించిన ఘటన కలకలం రేపుతోంది. వివాహ బంధాన్ని తుడిచిపెట్టేసేలా మహిళలు భయంకరమైన కుట్రలు పన్నడాన్ని ఈ ఘటన మరోసారి నిరూపిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. రాందాస్‌ను హత్య చేయాలని భావించిన భార్య జ్యోతి, తన ప్రణయ సంబంధం ఉన్న నలుగురు యువకులతో కలిసి పథకం వేసింది. బౌరంపేట వద్ద రాందాస్‌కు మద్యం తాగించి, అనంతరం బీర్ బాటిళ్లతో అతడిపై దాడికి దిగారు. ఈ దాడిలో రాందాస్‌కు తీవ్రగాయాలయ్యాయి. దాడి చేసిన యువకులు అతడు చనిపోయాడని భావించి అక్కడి నుంచి పరారయ్యారు.
Flight Services : సింగపూర్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు – చంద్రబాబు
అయితే రాందాస్ మాత్రం అర్థసమ్మస్మత స్థితిలో పడిపోయాడు. తరువాతః తీవ్ర గాయాలతో తన తమ్ముడి ఇంటికి వెళ్లి జరిగిన ఘటనను వివరించాడు. అతడి మాటలు విన్న తమ్ముడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే రంగంలోకి దిగిన బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం దాడిలో పాల్గొన్న నలుగురు యువకుల కోసం గాలింపు కొనసాగుతోంది.
ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఒక భార్యే భర్తను చంపేందుకు ఇంత దారుణంగా పథకం వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పోలీసులు ప్రస్తుతం జ్యోతిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.