White Paper On irrigation Projects : వందేళ్ల ప్రాజెక్ట్ మూడేళ్లలోనే కుంగింది – ఉత్తమ్
- Author : Sudheer
Date : 17-02-2024 - 11:20 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly) వాడివేడిగా నడుస్తున్నాయి. కొద్దీ సేపటి క్రితం సమావేశాలు మొదలుకాగా.. సభలో ఇరిగేషన్‌పై శ్వేత పత్రాన్ని (White Paper On Irrigation Projects) ప్రభుత్వం విడుదల చేసింది. నీటి ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar) సభలో మాట్లాడుతూ..
‘వందేళ్లు ఉండాల్సిన ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కుంగిందని, స్వాతంత్య్రం తర్వాత ఇరిగేషన్ రంగంలో ఇంతపెద్ద అవినీతి ఎప్పుడు జరగలేదు. 2023 అక్టోబర్ 21 న ప్రమాదం జరిగింది. డిసెంబర్ 7వరకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేసీఆర్ దీనిపై ఒక్కమాటా మాట్లాడలేదు. బ్యారేజీ ప్రారంభించినప్పటి నుంచి పర్యవేక్షణ, నిర్వహణ లేదు’ అని ఉత్తమ్ ఆరోపించారు. ప్రాజెక్ట్ లో డిజైన్, నాణ్యత లోపం, అవినీతి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతిందని వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
నీటి ప్రాజెక్టులపై సభ్యులకు పూర్తి అవగాహన కల్పించేందుకు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్నామని మంత్రి ఉత్తమ్ వివరించారు. కాళ్వేశ్వరంలో మేడిగడ్డ కీలకమైన బ్యారేజు అని తెలిపారు. ఇది గుండెకాయలాంటిదన్నారు. అలాంటి బ్యారేజ్ నిర్మాణంలో లోపారు కారణంగా ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని ఆరోపించారు. అవగాహన లేకుండానే దీని నిర్మాణం చేపట్టారని విమర్సించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని మోటార్లు ఒకేసారి పనిచేస్తే రోజుకు 203 మిలియన్ యూనిట్ల కరెంట్ అవసరమని , రాష్ట్రంలో మొత్తంలో అన్నిరకాల అవసరాలకు 160 మిలియన్ యూనిట్ల కరెంట్ చాలు. రాష్ట్రం మొత్తానికి కావాల్సిన కరెంట్ కంటే కాళేశ్వరానికి ఎక్కువ విద్యుత్ కావాలి. ఏడాదికి కాళేశ్వరానికి రూ. 10,375 కోట్ల కరెంట్ ఖర్చు అవుతోంది’ అని సభలో ఉత్తమ్ వివరించారు.
ఈ బ్యారెజ్ నిర్మాణానకి ముందు 18 వందల కోట్లకు టెండర్ పిలిచారని… నిర్మాణానికి మాత్రం నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని తెలిపారు ఉత్తమ్‌కుమార్ రెడ్డి. రానురాను ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ వెళ్లారని విమర్శించారు. ఈ సందర్భంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథార్టీ ఇచ్చిన నివేదికను సభలో ఉంచారు. ఈ ప్రాజెక్టు పూర్తిగా నాసిరకంగా ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతానికి నిరుపయోగమని తెలిపారు.
ఇక అన్నారం బ్యారేజీలో నిన్నటి నుంచి లీకులు మొదలయ్యాయి. అందులోని నీటిని తొలగించాలని NDSA పేర్కొంది. ఈ బ్యారేజీ కూడా ప్రమాదంలో ఉంది. కుంగేలా కనిపిస్తోంది. రిజర్వాయర్లో నీరు నింపొద్దని NDSA సూచించింది. కాళేశ్వరంపై కాగ్ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు.
Read Also : AP Jobs : వైజాగ్‌లో 130 జాబ్స్.. కడపలో 24 జాబ్స్.. అప్లై చేసుకోండి