Tongue Slip : ఆ ఊరు వెళ్లాక నోరు జారుతున్నాడు. ఆయనపై వస్తున్న ఆరోపణలేంటి?
నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితదంటరు. అయితే ఇక్కడ సామెత రివర్స్ అవుతోంది. ఆ ఊరు మంచిది కానందునే ఆయన నోటి నుంచి రాకూడని మాటలు, వినకూడని మాటలు వినిపిస్తున్నాయంటున్నారు
- By Balu J Published Date - 04:53 PM, Thu - 11 November 21

నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితదంటరు. అయితే ఇక్కడ సామెత రివర్స్ అవుతోంది. ఆ ఊరు మంచిది కానందునే ఆయన నోటి నుంచి రాకూడని మాటలు, వినకూడని మాటలు వినిపిస్తున్నాయంటున్నారు జనం. మేధావి వర్గంగా పేరుతెచ్చుకున్న ఆయన కాస్తా.. తన సైలెన్స్ శైలికి భిన్నంగా వయొలెన్స్ వాయిస్ వినిపిస్తుండటంతో చూసేవాళ్లు, వినేవారు నోరెళ్లబెట్టకతప్పడం లేదు. ఇంతకీ ఏ నాయకుడు ఆ ఊరు వెళ్లాక నోరు జారుతున్నాడు. ఆయనపై వస్తున్న ఆరోపణలేంటి? తెలుసుకుందాం.. మంత్రి నిరంజన్ రెడ్డికి నాగర్‌కర్నూల్ కలిసిరావడం లేదా?
తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్‌రెడ్డికి నాగర్‌కర్నూల్ అచ్చిరావడం లేదనిపిస్తుంది..నాగర్ కర్నూల్ జిల్లాకు వచ్చిన ప్రతీసారి ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు ఇరకాటంలో పడేస్తుండటంతో అందరిమదిలో ఇదే చర్చ జరుగుతోంది. మేధావివర్గంగా పేరుతెచ్చుకున్న వకీల్ సాబ్, తెలంగాణ ఉద్యమకారుడు నాగర్ కర్నూల్ నుంచి వినిపిస్తున్న వాయిస్.. నాయిస్ సృష్టిస్తోంది. పదే పదే మంత్రిగారు నోరుజారుతుండటం, వివాదం చెలరేగుతుండటంతో సారీ ఫర్ ది డిస్టబెన్స్ అని చెప్పడం అలవాటుగా మారిపోయింది. తేడా ఎక్కడ కొడుతుందనే విషయంపై కొందరు వినిపిస్తున్న లాజిక్.. మంత్రిగారు నాగర్ కర్నూలు వచ్చారంటే ఇక అంతే సంగతులనే మాట.
వైఎస్ షర్మిలపై మంగళవారం మరదలు వ్యాఖ్యలు
వైఎస్ షర్మిల గురించి మంత్రి నిరంజన్ రెడ్డి “మంగళవారం మరదలు” అని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మంట పుట్టించాయి. అంతకుముందు నిరుద్యోగులను ఉద్దేశించి మంత్రి మాట్లాడిన మాటలు హమాలీ కూడా ఉద్యోగమనే అర్ధం రావడంతో ప్రతిపక్షాలు, విద్యార్థులు, నిరుద్యోగులు నిప్పులు చెరిగారు. ఈ రెండువివాదాస్పద వ్యాఖ్యలు నాగర్‌కర్నూలు జిల్లా వేదికగా జరిగిన కార్యక్రమాల సందర్బంగా మంత్రిగారు తన నోటినుంచి వెలిబుచ్చారు. దీంతో ఆయనకు నాగర్ కర్నూల్ అచ్చిరావడం లేదని టాక్ వస్తోంది.
మాటలు మంటలు పుట్టించడంతో మన్నించమన్న మంత్రి
మంత్రిగారు పుట్టించిన మాటల మంటలు రాష్ట్రవ్యాప్తంగా అంటుకోవడంతో ఆందోళనలు మిన్నంటడం, దిష్టిబొమ్మలు దగ్దం కావడంతో తనకుతానుగా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు దిగిరాకతప్పలేదు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించిఉంటే వెనక్కితీసుకుంటున్నట్లుగా ప్రకటించకతప్పలేదు.
నాగర్‌కర్నూలు వచ్చారంటే మంత్రిగారి మాటల్లో తేడా!
పంచె దోవతితో చూడగానే పెద్దరికం ఉట్టిపడే పాతతరం నేతగా కనిపిస్తారు మంత్రి నిరంజన్ రెడ్డి. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకునే హుందాగల వ్యక్తిగా పార్టీలోనే కాదు ప్రత్యర్థిపార్టీలు కూడా ఆయన్ని చూస్తాయి. అలాంటిది ఆయన నోరుజారుతున్న తీరు చూస్తున్న కొందరు వినిపిస్తున్న మాట నాగర్‌కర్నూల్.. నిరంజన్‌రెడ్డికి అచ్చిరావటంలేదని. నాగర్‌కర్నూల్‌కి అనుబంధంగా జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులకు ఇబ్బంది కలిగించిన సంఘటనలు ఉదాహరణగా చెప్పుకుంటున్నారు అక్కడి జనం.
సీఎంలు అంజయ్య, మర్రి పదవులు మింగిన నాగర్ కర్నూల్!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ నాగర్ కర్నూలుకు రాకుండా పదవీగండం సెంటిమెంట్ అడ్డుపడిందనే లోకల్‌గా వినిపిస్తుంది. చంద్రబాబునాయుడు సీఎం హోదాలో నాగర్ కర్నూలుకు వచ్చారనే పేరేగాని కనీసం బస్సు కూడా దిగకుండా వెళ్లిపోయారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నాగర్‌కర్నూల్ రాకపోవడానికి సేమ్ రీజన్ చెబుతున్నారు పబ్లిక్. అదేంటంటే సీఎం హోదాలో నాగర్‌కర్నూలు వచ్చిన అంజయ్య, మర్రి చెన్నారెడ్డి కొంత కాలానికే పదవి కోల్పోయారు. అంతేకాదు ప్రధానమంత్రులుగా పనిచేసిన చరణ్ సింగ్, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ కూడా ఇక్కడికివచ్చి వెళ్లాక పదవి పొగొట్టుకున్నవాళ్లేనని చెబుతారు నాగర్‌కర్నూల్ వాసులు.
అంతెందుకు మొన్నటికి మొన్న 2016లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సామూహిక వివాహాలు జరిపిస్తే ఆ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ నాగర్ కర్నూల్‌కు వస్తారనే ప్రచారం జరిగింది. పదవీగండానికి, నాగర్ కర్నూల్‌కు ఉన్నసెంటిమెంట్ గురించి తెలియడంతో ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వస్తుందన్నట్లు మనకెందుకనుకుని నాగర్ కర్నూల్ వచ్చేందుకు కేసీఆర్ నైనై చెప్పారనే గుసగుసలు వినిపిస్తుంటాయి. వరుసగా మంత్రి నిరంజన్‌రెడ్డి కేంద్రంగా చుట్టుకుంటున్న వివాదాలకు నాగర్ కర్నూల్ సెంటిమెంట్‌ను అన్వయిస్తున్నారు అక్కడి నేతలు
Related News

1 Killed : అమెరికాలో స్విమ్మింగ్‌పూల్‌లో పడి హైదరాబాద్ వ్యక్తి మృతి
అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన 31 ఏళ్ల వ్యక్తి ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్ పూల్‌లో పడి మునిగి మృతి చెందినట్లు అతని