KTR – Lokesh : లోకేష్ ను కలిస్తే తప్పేంటి – రేవంత్ కు కేటీఆర్ సూటి ప్రశ్న
KTR - Lokesh : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు జరగకపోగా, బీజేపీతో కలిసి కొంతమంది నేతలకు లాభాలు చేకూరుతున్నాయంటూ పొంగులేటి ఉదాహరణను చూపించారు. ఆయన ఇంటిపై గతంలో నోట్ల కట్టల దాడులు చేసిన ఈడీ ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉందని ఉందంటూ ప్రశ్నించారు.
- Author : Sudheer
Date : 18-07-2025 - 5:07 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర విమర్శల మోత మోగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth)పై ఘాటుగా విరుచుకుపడ్డారు. ఖమ్మంలో పర్యటించిన కేటీఆర్, పువ్వాడ అజయ్ నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తూ, రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరుల ఫోన్‌లు ట్యాప్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. పదవికి భంగం కలగకూడదన్న భయంతోనే రేవంత్ ఈ చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క ఫోన్‌లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు..ఈ విషయంలో లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమా అని సవాల్ విసిరారు.
Felix Baumgartner : సూపర్‌సోనిక్ స్కైడైవర్ ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్ మరణం
అంతేకాదు, లోకేష్‌తో రాత్రి భేటీ అయినట్టు తప్పుడు ప్రచారం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ తనకు తమ్ముడిలాంటివారని, ఆయన్ని కలవాలంటే పగలే కలుస్తానని అన్నారు. చంద్రబాబు కుమారుడైన లోకేష్‌ను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. రేవంత్ మాత్రం గ్యారంటీలు ప్రజలకోసం కాదు, తన కుటుంబం, చంద్రబాబు, ఢిల్లీ ముఠా కోసం అమలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి చీఫ్ మినిస్టర్‌గా లాభపడే విధంగా కాంట్రాక్టులు కేటాయిస్తున్నారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి, ప్రజలను దారి మళ్లించేందుకు చిట్‌చాట్ పేరుతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఒక్కసారి డ్రగ్స్ కేసు, మరోసారి నటితో సంబంధాలు అంటూ అనవసర దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ విధంగా ప్రజల దృష్టిని మళ్లించడం ఎంతకాలం సాగుతుందని ప్రశ్నించారు. రేవంత్ మాదిరిగా చీకటి రాజకీయాలు తాము చేయమని, ప్రజల సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెడతామని స్పష్టం చేశారు.
Pawan Kalyan: జనసేనాని కీలక నిర్ణయం.. కూటమిలో టీడీపీ ఆధిపత్యానికి చెక్?!
ఇక బనకచర్ల ప్రాజెక్టు విషయాన్ని ప్రస్తావించిన కేటీఆర్, రేవంత్ రెడ్డి చేతకానితనాన్ని ఎత్తి చూపారు. ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండానే గోదావరి నీటితో బనకచర్ల నిర్మిస్తుంటే, తెలంగాణ సీఎంగా రేవంత్ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు జరగకపోగా, బీజేపీతో కలిసి కొంతమంది నేతలకు లాభాలు చేకూరుతున్నాయంటూ పొంగులేటి ఉదాహరణను చూపించారు. ఆయన ఇంటిపై గతంలో నోట్ల కట్టల దాడులు చేసిన ఈడీ ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉందని ఉందంటూ ప్రశ్నించారు.