HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >We Will Fulfill Every Promise Minister Sridhar Babu

Sridhar Babu : ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం – మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridhar Babu : రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ ప్రకారం రూ.2 లక్షల లోపు రుణాలను పూర్తి మాఫీ చేశామని, ఇందుకోసం రూ.21 వేల కోట్ల ఖర్చు చేయడం జరిగిందని వివరించారు.

  • Author : Sudheer Date : 08-12-2024 - 8:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
My Ticket App
My Ticket App

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) తెలిపారు. ప్రజా పాలనా ఉత్సవాల్లో మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ ప్రకారం రూ.2 లక్షల లోపు రుణాలను పూర్తి మాఫీ చేశామని, ఇందుకోసం రూ.21 వేల కోట్ల ఖర్చు చేయడం జరిగిందని వివరించారు. రూ.2 లక్షల పైన ఉన్న రుణాలను కూడా మాఫీ చేయడంపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని మంత్రి తెలిపారు. కొన్ని కారణాల వల్ల హామీల అమలు ఆలస్యమవుతుందని, తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఏమాత్రం వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.

ప్రతి హామీని నెరవేర్చేందుకు నాయకులంతా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని, ప్రజల సంక్షేమం కోసం కృషి కొనసాగుతుందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు రైతుల నమ్మకాన్ని పెంచుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రుణమాఫీతో పాటు ప్రజలకు ఇచ్చిన ఇతర హామీల అమలుపై కూడా దృష్టి పెట్టామని మంత్రి తెలియజేశారు. కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం లాంటి హామీల అమలు కాస్త సమయం పడుతుందని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే.. నిరుద్యోగ యువత బాధను అర్థం చేసుకుని.. ఏకంగా 55 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు జాబ్‌ క్యాలెండర్‌ కూడా విడుదల చేస్తున్నామన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ (BRS) హయాంలో ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదని తెలిపారు. కానీ ప్రజల బాగోగులు, సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, తాము అహర్నిశలు పనిచేస్తామని అన్నారు. మంత్రిత్వ శాఖపై ఉన్న బాధ్యతలను నెరవేర్చడంలో తమ ప్రభుత్వం ముందు ఉంటుందని, ప్రజలు ఇచ్చిన మద్దతుకు తగిన విధంగా పాలన అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.

Read Also : Manchu Manoj : నడవలేని స్థితిలో మంచు మనోజ్..అంత దారుణంగా కొట్టడమేంటి..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress party
  • Congress Promises
  • Minister Sridhar Babu
  • praja palana vijayotsavam celebration
  • telangana

Related News

MIssing Case

Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • A New Look for the Kaleswaram Temple

    Kaleshwaram Temple: కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపురేఖలు

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

Latest News

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd