Congress : ఉచిత విద్యుత్‌యే కాదు.. దుక్కి దున్నడానికి భూమి ఇచ్చింది కూడా కాంగ్రెస్సే..1
తెలంగాణలో పవర్ పాలిటిక్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్, బీర్ఎస్ నేతల మధ్య ఉచిత విద్యుత్‌పై మాటల
- By Prasad Published Date - 06:37 PM, Sat - 15 July 23

తెలంగాణలో పవర్ పాలిటిక్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్, బీర్ఎస్ నేతల మధ్య ఉచిత విద్యుత్‌పై మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ యే కాదు దుక్కిదున్నడానికి భూమి ఇచ్చింది కూడా కాంగ్రెస్సే అంటూ ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి రైతులు, పేదలకు అండగా నిలిచిన పార్టీ. రైతు రుణమాఫీ దేశ వ్యాప్తంగా అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ సొంతం. ఉచిత విద్యుత్ తొలిగా అమల్లోకి తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. అసలు రైతన్న, నేతన్న, మహిళలు, దళితులు, బీసీలు ఎవరి గురించి అయినా ఆలోచన చేసేదీ, అభ్యున్నతికి పని చేసింది కాంగ్రెస్ పార్టీనే. అన్ని వర్గాల కోసం కాంగ్రెస్ అమలు చేసిన పథకాలనే కాపీ కొడుతూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ చేయలేనది, తాను చేసింది ఏంటో చెప్పలేని నిస్సహాయత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఫిలాసఫీలోనే రైతు సంక్షేమం ఉందని.. కాంగ్రెస్ విధానంలోనే పేదల అభ్యున్నతి కనిపిస్తుందని నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ నినాదమే దళితుల అభివద్ది అని.. . రైతులకు ఉచిత కరెంట్ పైన నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటంతో ఎగిరెగిరి పడుతోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో ఎక్కడా రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందుతోందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ నుంచి సమాధానం లేదు. రైతులకు సీలింగ్ యాక్ట్ కింద భూమిని పంచింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన హామీ మేరకు అందని అంచనాలను తల కిందులు చేస్తూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక పైనే కాంగ్రెస్ సీఎంగా వైఎస్సార్ ఉచిత విద్యుత్ పైన తొలి సంతకం చేసారు. రైతు సంక్షేమంలో కాంగ్రెస్ కు ఎవరూ పోటీ రాలేరని.. కాంగ్రెస్ అమలు చేసిన పథకాలనే తప్పని పరిస్థితుల్లో అమలు చేస్తూ తన గొప్పతనం గా ప్రచారం చేసుకుంటున్నారని నాయకులు ఆరోపిస్తున్నారు. దేశంలో పేదలకు భూములు పంపిణీ చేసిన చరిత్ర కాంగ్రెస్ సొంతమని… నాడు పంచిన భూములకు నేడు పట్టాలు ఇచ్చి అంతా మేమే చేసామని గొప్పలు చెప్పుకొనే దీన స్థితిలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మహిళలు, దళితులు, విద్యార్ధుల సంక్షేమానికి కాంగ్రెస్ తీసుకొచ్చిన స్కీంలే నేటికి అమలు అవుతున్నాయని.. పేదలకు ఆరోగ్య శ్రీ తో కార్పోరేట్ వైద్యం అందించటం కాంగ్రెస్ విధానమని గుర్తు చేశారు.