500 Crores Seize : 27 రోజుల్లో రూ.500 కోట్ల సొత్తు సీజ్.. పోలీసుల తనిఖీలు ముమ్మరం
500 Crores Seize : తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ తరుణంలో అక్రమ ధన ప్రవాహానికి కళ్లెం వేసేందుకు పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.
- By Pasha Published Date - 06:54 AM, Mon - 6 November 23

500 Crores Seize : తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ తరుణంలో అక్రమ ధన ప్రవాహానికి కళ్లెం వేసేందుకు పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలో అక్టోబరు 9 నుంచి ఇప్పటివరకు జరిగి తనిఖీల్లో దాదాపు రూ.500 కోట్ల విలువైన సొత్తును పోలీసులు సీజ్ చేశారు. తాజాగా ఆదివారం రోజు హైదరాబాద్‌లోని నిజాంపేటలో 17 కేజీల బంగారం, 75 కేజీల వెండిని పట్టుకున్నారు.దీన్నిబట్టి ఏ రేంజ్‌లో ఈసారి ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టేందుకు పార్టీలు రెడీ అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు పోలీసులు సీజ్ చేసిన వాటిలో నగదుతో పాటు వెండి, మద్యం, మత్తు పదార్థాలు, కుక్కర్లు, మిక్సీలు కూడా ఉండటం గమనార్హం. పోలీసులు ఇప్పటివరకు 84,400 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు.దీని విలువ దాదాపు రూ.3 కోట్ల దాకా ఉంటుంది. దీని అక్రమ సప్లైలో భాగమైన వారిపై 88 కేసులు నమోదుచేసి 23 మందిని అరెస్టు చేశారు. 75 కేజీల గంజాయిని కూడా సీజ్ (500 Crores Seize) చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ నెలాఖరున పోలింగ్ జరిగే వరకు తనిఖీలు కంటిన్యూ కానున్నాయి.ఇక రాష్ట్ర సరిహద్దుల వెంట, కీలకమైన ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మరీ పోలీసులు చెకింగ్స్ చేస్తున్నారు. సామాన్యుల నుంచి మొదలుకొని సంపన్నులు, వ్యాపారులు, వీఐపీలు, మంత్రులు, చివరకు సీఎం వాహనాన్ని కూడా వదలకుండా తనిఖీ చేస్తున్నారు. అందుకే ఇంత రేంజ్‌లో పోలీసులకు సొత్తు దొరుకుతోంది.