Oil Free Chicken Fry : డైట్ లో ఉన్నారా ? ఆయిల్ ఫ్రీ చికెన్ ఫ్రై ఇలా చేయండి..
ఒక గిన్నెలోకి చికెన్ ను తీసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి మినహా మిగిలిన అన్నింటినీ వేసి బాగా కలుపుకోవాలి. అరగంటసేపు మ్యారినేట్ చేశాక.. ఒక కళాయిని స్టవ్ పై పెట్టి..
- By News Desk Published Date - 10:38 PM, Sun - 5 November 23
Oil Free Chicken Fry : డైట్ లో ఉంటే అన్నిరకాల ఆహారాలు తినలేరు. ముఖ్యంగా ఆయిల్ ఫ్రీ ఫుడ్స్ నే ఎక్కువ ప్రిఫర్ చేయాలి. చికెన్ తినాలనుకున్నా.. ఉడికించినదే తినాల్సి ఉంటుంది. ఇలాంటపుడు ఫ్రై ఐటమ్స్ తినాలనిపిస్తే.. అలాంటి కోరికలను కంట్రోల్ చేసుకోవాల్సిందే. కానీ.. చికెన్ ఫ్రై ను.. ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకుండా ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా ? చేయకపోతే ఇప్పుడు ట్రై చేసి తిని చూడండి. ఆయిల్ తో చేసిన టేస్ట్ అస్సలు మిస్ అవ్వకుండా అద్భుతంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ఇలా నూనె లేకుండా చికెన్ ఫ్రై తయారు చేసి తీసుకోవచ్చు. మరి ఆయిల్ ఫ్రీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
చికెన్ ఫ్రై తయారీకి కావలసిన పదార్థాలు..
చికెన్ – 1 కిలో
ఉప్పు – రుచికి తగినంత
కారం – 3 టేబుల్ స్పూన్స్
పసుపు – 1/4 టీ స్పూన్
మిరియాలపొడి – 1/2 స్పూన్
ధనియాల పొడి – 1 టీ స్పూన్
చికెన్ మసాలా – 1 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
కరివేపాకు – 1 రెమ్మ
నీరు లేకుండా వడకట్టిన మీగడ పెరుగు – 1/2 కప్పు
నిమ్మరసం – 1/2 చెక్క
తరిగిన పచ్చిమిర్చి – 6
చికెన్ ఫ్రై తయారీ విధానం..
ఒక గిన్నెలోకి చికెన్ ను తీసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి మినహా మిగిలిన అన్నింటినీ వేసి బాగా కలుపుకోవాలి. అరగంటసేపు మ్యారినేట్ చేశాక.. ఒక కళాయిని స్టవ్ పై పెట్టి.. అందులో మ్యారినేటెడ్ చికెన్ వేసి పెద్దమంటపై 5 నిమిషాలపాటు వేయించుకోవాలి. దానిపై మూతపెట్టి చిన్నమంటపై మధ్యమధ్యలో కలుపుతూ చికెన్ ను పూర్తిగా ఉడికించుకోవాలి.
చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత మూత తీసి.. అందులో నీరంతా పోయేంతవరకూ వేయించాలి. ఇందులోనే పచ్చిమిర్చి, మరో రెమ్మ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి కలుపుకోవాలి. ఫ్రై దగ్గర పడేంతవరకూ వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే.. ఆయిల్ ఫ్రీ చికెన్ ఫ్రై రెడీ. వేడివేడి అన్నంలో లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో దీనిని సైడ్ డిష్ గా తింటే.. అస్సలు వదిలిపెట్టరు.
Related News
Carrot Milk Shake : క్యారెట్ మిల్క్ షేక్.. పక్కా కొలతలతో ఇలా చేయండి..
ఇంట్లోనే హెల్దీగా ఉండే క్యారెట్ మిల్క్ షేక్ ను తయారు చేసుకోవచ్చు. తీపి కోసం పంచదార శరీరంలో ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది. పంచదార వేయకుండానే ఈ మిల్క్ షేక్ ను తయారు చేసుకోండి..