KCR : అతి త్వరలో కేసీఆర్ అనే పదం కనిపించదు – సీఎం రేవంత్
KCR : అతి త్వరలో కేసీఆర్ అనే పదం కనిపించదు - సీఎం రేవంత్
- By Sudheer Published Date - 07:21 PM, Tue - 29 October 24

కేసీఆర్ రాజకీయం ఏడాదిలో ముగుస్తుందని ఆపై కెసిఆర్ అనే పదమే కనిపించదని CM రేవంత్ సంచలన కామెంట్స్ చేశారు. ‘ఆయన ఫ్యామిలీలో గొడవలు నడుస్తాయి. బావతో బావమరిది రాజకీయం ముగుస్తుంది. కెసిఆర్ ఉనికి లేకుండా కేటీఆర్ ను వాడాను. త్వరలో కేటీఆర్ ఉనికి లేకుండా బావ హరీశ్ ను వాడతాను. ఇద్దరినీ ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు. రాజ్ కనకాల ఇంట్లో క్యాసినో కాయిన్స్ దొరికాయి. దీపావళి పార్టీ అని ఎలా అంటారు?’ అని CM ప్రశ్నించారు.
రెండు రోజుల క్రితం కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్ హౌస్ పై పోలీసులు రైడ్ చేస్తే, అక్కడ విదేశీ మద్యం, పోకర్ కాయిన్స్ మరియు కొకైన్ లభించాయి. ఈ ఘటనలో ఒకరికి కొకైన్ పాజిటివ్ రావడంతో కేసు నమోదైంది. విజయ్ మద్దూరి రాజ్ పాకాలపై ఆరోపణలు చేస్తూ, కొకైన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే, రాజ్ పాకాల హైకోర్టులో పిటిషన్ వేసి, విచారణకు రెండు రోజులు సమయం అడిగారు. రాబోయే రోజుల్లో ఆయన పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది. బీఆర్ఎస్ నేతలు ఈ కేసును రాజకీయ ప్రేరేపితమని అభిప్రాయపడుతున్నారు, వారు ఫ్యమిలీ దావత్‌ను రేవ్ పార్టీగా ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి దీనికి కౌంటర్ ఇవ్వడం ద్వారా రాజకీయంగా దీనిని మరింత ఉత్కంఠభరితంగా మార్చారు.
Read Also : Bro Anil Kumar : తనపై జగన్ విపరీతమైన ఒత్తిడి తెచ్చాడు – బ్రదర్ అనిల్‌కుమార్