News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Telangana News
  • ⁄Vegetable Prices Soar In Hyderabad And Telangana

Vegetable Prices : హైదరాబాద్ లో భారీగా పెరుగుతున్న కూరగాయల ధరలు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాజకీయాలు వేడి పెంచుతున్నాయి. కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. హైదరాబాద్ లో ఏదైనా కూర కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది.

  • By Hashtag U Published Date - 08:00 PM, Mon - 2 May 22
Vegetable Prices : హైదరాబాద్ లో భారీగా పెరుగుతున్న కూరగాయల ధరలు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాజకీయాలు వేడి పెంచుతున్నాయి. కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. హైదరాబాద్ లో ఏదైనా కూర కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది. కొన్ని కూరగాయల రేట్లు తగ్గి ఉపశమనం కలిగితే.. మరికొన్ని కూరల ధరల రేట్లు మాత్రం జేబుకు చిల్లుపెడుతున్నాయి. అలాంటివాటిలో టమాటా ముందు వరసలో ఉంది.

వారం కిందటి వరకు.. అంటే ఏప్రిల్ 24న కొత్త పేట రైతు బజార్ లో కేజీ రూ.22 ఉన్న టమాటా.. ఇప్పుడు ఏకంగా రూ.38లకు పెరిగింది. అంటే కేవలం వారం రోజుల్లోనే కేజీకి రూ.14 మేర పెరిగింది. కేజీ పచ్చిమర్చి ఖరీదు రూ.ఐదు పెరిగింది. క్యారెట్, క్యాప్సికమ్ ధర తగ్గినా.. మిగిలిన కూరగాయ రేట్లు మాత్రం గూబ గుయ్యిమనిపిస్తున్నాయి. ఇక తోపుడు బండ్లపైన అమ్మేవారైతే.. కేజీకి రూ.10 పెంచి అమ్ముతున్నారు.

నిమ్మకాయలు కూడా ఏమాత్రం రేటు తగ్గట్లే. పెద్ద సైజు కాయలైతే కేజీకి రూ.250-300, చిన్న సైజు కాయలైతే.. కేజీకీ రూ.150-200 వసూలు చేస్తున్నారు. రంజాన్ సీజన్ కావడం వల్లే వ్యాపారులు రేట్లు పెంచారన్న టాక్ వినిపిస్తోంది. ఈ సీజన్ లో ముస్లింలు రోజా ఉంటారు. రంజాన్ రోజున వంటకాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. అంటే బిర్యానీలు, ఇతర వంటల్లో టమోటాలు, పచ్చిమిర్చిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అందుకే రేట్లను విపరీతంగా పెంచి అమ్ముతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

వేసవిలో పంట దిగుబడి తగ్గుతుంది. అందుకే రేట్లు కూడా క్రమంగా పెరుగుతుంటాయి. అయినా తగిన ముందుజాగ్రత్తలు తీసుకుంటే.. ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదంటున్నారు ప్రజలు.

Tags  

  • telangana news
  • vegetable prices

Related News

Jan Suraj : ఔను! వాళ్లిద్ద‌రూ ‘జ‌న్ సురాజ్’ లే.!!

Jan Suraj : ఔను! వాళ్లిద్ద‌రూ ‘జ‌న్ సురాజ్’ లే.!!

తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతోన్న కొత్త పార్టీ ప్ర‌శాంత్ కిషోర్ రూపంలో బ‌య‌ట‌కొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. కొత్త పార్టీ గురించి పీకే చేసిన ట్వీట్ కేసీఆర్ ఇటీవ‌ల వినిపించిన భావ‌జాలానికి ద‌గ్గ‌ర‌గా ఉండ‌డం అనుమానాల‌కు తావిస్తోంది. ప్ర‌జానుకూల విధానాన్ని రూపొందించ‌డానికి సిద్ధం అవుతున్న‌ట్టు ట్వీట్ ద్వారా పీకే ప్ర‌క‌టించారు.

  • KCR Plan : హాట్రిక్ కోసం కేసీఆర్ జిడ్డాట‌!

    KCR Plan : హాట్రిక్ కోసం కేసీఆర్ జిడ్డాట‌!

  • MP Santosh & CM KCR : ఒక ఫోటో..ఎన్నో ఊహ‌లు.!

    MP Santosh & CM KCR : ఒక ఫోటో..ఎన్నో ఊహ‌లు.!

  • Vegetable Prices : ఏం కొనేట‌ట్టు లేదు..ఏం తినేట‌ట్టు లేదు

    Vegetable Prices : ఏం కొనేట‌ట్టు లేదు..ఏం తినేట‌ట్టు లేదు

  • కేటీఆర్ ఇప్ప‌ట్లో సీఎం కాన‌ట్టే! కొత్త ఫార్మాట్లో టీఆర్ఎస్ చీఫ్

    కేటీఆర్ ఇప్ప‌ట్లో సీఎం కాన‌ట్టే! కొత్త ఫార్మాట్లో టీఆర్ఎస్ చీఫ్

Latest News

  • YCP Rajyasabha : వైసీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులు ఖ‌రారు

  • Arshdeep: ధోనీ, హార్దిక్ పాండ్యలాంటి వాళ్ళనూ సైలెన్స్ చేయించే బౌలర్ అతడు :ఇర్ఫాన్ పఠాన్

  • Davos Challenge : సోద‌రుల‌కు `దావోస్` ఛాలెంజ్‌!

  • The Kashmir Files: అక్కడ హిట్.. ఇక్కడ ఫట్!

  • IPS Transfers : జ‌గ‌న్ మార్క్ పోలీస్ బ‌దిలీలు

Trending

    • Googled questions on Sex: గూగుల్ లో శృంగారం గురించి పబ్లిక్ ఎక్కువగా వెతికే టాపిక్స్ ఇవే…

    • Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!

    • Putin Health: రష్యాలో తీవ్ర కలకలం, పుతిన్ ఆరోగ్య పరిస్థితి విషమం.!!

    • Menstual Leave: ఇకపై ఆ దేశంలో మహిళలకు నెలకు మూడు రోజుల పీరియడ్ లీవ్…

    • Bajrang Dal Weapons: కర్నాటకలో మరో వివాదం…ఎయిర్ గన్స్ తో బజరంగ్ దళ్ కార్యకర్తలకు ట్రైనింగ్..!!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: