Uttam Kumar : కాంగ్రెస్ గెలుపు ఖాయం..నేను గడ్డం తీయడం ఖాయం – ఉత్తమ్
కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుండడంతో ..రేపు నా గడ్డం తీసేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు
- Author : Sudheer
Date : 02-12-2023 - 8:36 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఎవ్వరు ఆపలేరంటున్నారు కాంగ్రెస్ నేతలు..ప్రతి ఒక్కరు కాంగ్రెస్ విజయ డంఖా మోగించబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. శనివారం మీడియా తో ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ..రేపటితో నా మొక్కు తీరుతుందని.. కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుండడంతో ..రేపు నా గడ్డం తీసేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.
క్యాంపు రాజకీయాల గురించి తనకు తెలియదని , ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్యాంపు రాజకీయం తప్పేమీ కాదని చెప్పుకొచ్చారు. సీఎం ఎవరన్నది అధిష్టానమమే నిర్ణయిస్తుందని, రేపు రిజల్ట్ తర్వాతే తాను ఈ అంశంపై మాట్లాడుతాన్నారు. ఎగ్జిట్ ఫలితాలు తమకు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నదని వ్యక్తిగతంగా తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇలా కాంగ్రెస్ ధీమా ఉంటె..మరోపక్క బిఆర్ఎస్ మాత్రం ఎగ్జిట్ పోల్స్ కాదు అసలైన రిజల్ట్ రేపు వస్తుందని..70 స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పుకొస్తుంది. బిఆర్ఎస్ ధీమా చూసి చాలామందిలో అనేక అనుమానాలు వస్తున్నాయి. కావాలనే బిఆర్ఎస్ ఎగ్జిట్ పోల్స్ లలో కాంగ్రెస్ వచ్చేలా చేసిందని..అసలైన రిజల్ట్ తమకే వస్తుందని తెలిసి ఇలా చేయిస్తుందని..అసలు రిజల్ట్ వచ్చాక కాంగ్రెస్ పరువు తీసేలా ప్లాన్ చేసి ఉంటుందని కొంతమంది అంటున్నారు. మరి అసలు ఏంజరగబోతుంది..? ఎవరు విజేత అవుతారు..? అనేది రేపు మధ్యాహ్నం కల్లా తెలుస్తుంది.
Read Also : TS Polls Results 2023 : తెలంగాణ కాంగ్రెస్ సీఎం కోసం “ప్రజా పాలన భవన్” సిద్ధం – కాంగ్రెస్ ట్వీట్