Urgent Requirement : ట్రాన్స్ ఫార్మర్ల దగ్గర తొండలు, బల్లులు, ఉడుతలను పట్టేవాళ్ళు కావలెను
తొండలు, బల్లులు, ఉడుతలను చూసి ఉలిక్కిపడుతున్న కాంగ్రెస్ భజన బ్యాచ్ త్వరపడండి
- Author : Sudheer
Date : 26-06-2024 - 7:56 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ లో బిఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు పవర్ కట్ అంటే తెలియదు..పట్టణాలు , నగరాల్లోనే కాదు పల్లె ల్లో కూడా 24 గంటలు కరెంట్ ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి పవర్ కట్స్ మొదలయ్యాయి. ప్రతి రోజు పదుల సంఖ్యలో పవర్ అనేది పోతుంది. ఎందుకు కరెంట్ పోతుందని అడిగితే విద్యుత్తు అధికారులు చెప్పే సమాధానం వింటే నవ్వువస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
కరెంటు ఎందుకు పోయింది? ట్రాన్స్‌ఫార్మర్‌పై తొండ పడింది. కరెంటు ఎందుకు పోయింది? ట్రాన్స్‌ఫార్మర్‌పై బల్లి పడింది. కరెంటు ఎందుకు పోయింది..? ట్రాన్స్‌ఫార్మర్‌పై పక్షి వాలింది. ఇవీ.. కరెంటు కోతలపై విద్యుత్తు సిబ్బంది చెప్తున్న కారణాలు. ఈ కారణాలు విని ఇలా కూడా జరుగుతుందా..? మరి బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ పక్షాలు , బల్లులు వాలలేదా..? అని మాట్లాడుకుంటున్నారు. దీనిపై బిఆర్ఎస్ కూడా మొదటి నుండి ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తూ వస్తుంది. పదేళ్ల మా అధికారంలో అసలు పవర్ పోయింది లేదు..ఇప్పుడు ఎందుకు పోతుందని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పుడు హైదరాబాద్ మెట్రో పిల్ల్లర్ కు ఏర్పాటు చేసిన ప్లెక్సీ ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసారు.
ఈ ప్లెక్సీ లో Urgent Requirement : ట్రాన్స్ ఫార్మర్ల దగ్గర తొండలు, బల్లులు, ఉడుతలను పట్టేవాళ్ళు కావలెను అంటూ రాసి ఉంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఎక్కడికి వెళ్లిన రాష్ట్రంలో పవర్ అనేది పోవడం లేదని..చెపుతుండడం ఫై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తొండలు, బల్లులు, ఉడుతలను చూసి ఉలిక్కిపడుతున్న కాంగ్రెస్ భజన బ్యాచ్ త్వరపడండి..
ఆలోచించిన ఆశాభంగం.. మంచి తరుణం మించిన దొరకదు..
అర్హులు వెంటనే గాంధీ భవన్‌కు వెళ్ళి అప్లై చేసుకోండి. pic.twitter.com/TEFCPuMJeu
— BRS Party (@BRSparty) June 26, 2024
Read Also : Car Mileage Tips: ఈ సింపుల్ ట్రిక్స్‌తో మీ కారు మైలేజీ పెంచుకోండి ఇలా..!