Revanth – KomatiReddy – Song : కోమటిరెడ్డి – రేవంత్ సాంగ్.. ‘కంచె ఒకడైతే.. అది మించెవాడొకడే’
Revanth - KomatiReddy - Song : రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరుస్తూ సీఎం రేవంత్ రెడ్డికి చేరువయ్యే ప్రయత్నాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు.
- By Pasha Published Date - 02:02 PM, Sun - 31 December 23

Revanth – KomatiReddy – Song : రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరుస్తూ సీఎం రేవంత్ రెడ్డికి చేరువయ్యే ప్రయత్నాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ‘‘కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం’’ అనే క్యాప్షన్‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఉన్న ఫొటోను డిసెంబరు 30న పోస్ట్ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు మరో కొత్త ట్వీట్‌తో సంచలనం రేపారు. తన ఫొటోలు, సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోలతో ‘‘కంచె ఒకడైతే.. అది మించెవాడొకడే’’ అనే సలార్ మూవీ సాంగ్‌తో ఒక వీడియోను కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్(Revanth – KomatiReddy – Song) చేశారు. తద్వారా తామిద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవని.. ఇద్దరం మంచి మిత్రులం అనే సందేశాన్ని రాజకీయ వర్గాల్లోకి పంపారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి అభిమానులు ఖుష్ అయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు విభేదాలను పక్కనబెట్టి కలిసిమెలిసి ఉంటే రాష్ట్ర భవిష్యత్తుకు మంచిదేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
We’re now on WhatsApp. Click to Join.
వేగమొకడు… త్యాగమొకడు
గతము మరువని గమనమే.ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే
ఒకరు గర్జన… ఒకరు ఉప్పెన
వెరసి ప్రళయాలే.సైగ ఒకరు… సైన్యం ఒకరు
కలిసి కదిలితే కదనమే…#AdminPost #KomatiReddyVenkatReddy #RevanthReddy #TelanganaPrajaPrabhutwam @revanth_anumula @INCTelangana pic.twitter.com/BPNdM4LuRZ— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 31, 2023
Also Read: INS Vikrant : ఒక నౌకలో 30 విమానాలు.. ‘ఐఎన్ఎస్ విక్రాంత్’లో రెండు కొత్త టెక్నాలజీలు
కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు అనేవి పాత విషయమే. ఇది అందరికీ తెలిసిన ముచ్చటే. అయితే ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ కలిసి పోరాటం చేశారు. పీసీసీ చీఫ్ హోదాలో రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ ప్రచారం చేసేలా కాంగ్రెస్ అధిష్టానం లైన్ క్లియర్ చేసింది. అందుకే హస్తం పార్టీని గెలుపు వరించింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందైతే.. కాంగ్రెస్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎవరెవరు ప్రచారం చేయాలనే దానిపైనా పార్టీ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. ఎట్టకేలకు అందరితో చర్చించి.. వారిని కలిపి, నడిపి.. కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చడంలో అధిష్టానం సక్సెస్ అయింది. రేవంత్ రెడ్డి అలుపెరగకుండా, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సుడిగాలి ప్రచారం చేసిన తీరు కూడా ఎంతో గొప్పది.