HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Unemployed Attempt To Storm The Secretariat

Telangana Secretariat : సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు యత్నం

Telangana Secretariat : ఎన్నికల సమయంలో ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని మరిచిపోయారని నిరుద్యోగులు ఆరోపించారు

  • Author : Sudheer Date : 04-07-2025 - 1:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jac Protest
Jac Protest

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా, ఉద్యోగ భర్తీ ప్రక్రియ విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శుక్రవారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను లక్ష్యంగా చేసుకుని నిరుద్యోగ జేఏసీ ఆందోళనకు దిగింది. ఎన్నికల సమయంలో ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని మరిచిపోయారని నిరుద్యోగులు ఆరోపించారు. జాబ్ క్యాలెండర్‌ విడుదల చేసి, నోటిఫికేషన్లు జారీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

CM Chandrababu : భూ సమస్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష..రెవెన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తి

ఈ నేపథ్యంలో శుక్రవారం వామపక్ష విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిరుద్యోగులు సచివాలయం ముట్టడి(Telangana Secretariat)కి యత్నించారు. అయితే ముందస్తుగా దీనికి సిద్ధంగా ఉన్న పోలీసులు నిరుద్యోగులను అడ్డుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో సచివాలయ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగుల నినాదాలు, పోలీసుల అప్రమత్తత మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో ట్రాఫిక్ కూడా తీవ్రంగా నిలిచిపోయింది.

న్యాయం కోసం ప్రశాంతంగా పోరాడుతున్న తమను అరెస్ట్ చేయడం తగదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. దాంతో, మళ్లీ ముట్టడికి ప్రయత్నిస్తున్న ప్రతి విడత నిరుద్యోగులను పోలీసులు అడ్డుకుంటూ అరెస్టు చేస్తుండటంతో ప్రభుత్వం వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నిరుద్యోగ జేఏసీ తదుపరి కార్యాచరణపై చర్చలు ప్రారంభించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Congress Job calendar
  • hyderabad
  • JAC protest
  • mallikarjun kharge
  • telangana secretariat

Related News

Hyderabad Minor Girl instagram Trap Case

డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

Hyderabad Minor Girl  ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలిం

  • Hyderabad Woman Disappears After Dispute Over Eating Curd

    పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

  • Dhoni Srh Match

    2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

  • Telangana Sachivalayam

    Outsourcing Contracts : తెలంగాణ సచివాలయంలోని అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్టుల కేటాయింపుల్లో అవకతవకలు ?

  • Sanjana

    Actress Sajini : హైదరాబాద్‌లో మలయాళ నటిపై దాడి !!

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd