Hyderabad Tourists Died : విరిగిపడ్డ కొండచరియలు.. హైదరాబాద్ టూరిస్టుల మృతి
హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాలు వరదలతో వణికిపోతున్నాయి.
- By Pasha Published Date - 05:10 PM, Sat - 6 July 24

Hyderabad Tourists Died : హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాలు వరదలతో వణికిపోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉత్తరాఖండ్‌లో టూర్‌కు వెళ్లిన వారు అవస్థలు పడాల్సి వస్తోంది. వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రత్యేకించిన మన హైదరాబాద్‌కు చెందిన ఉత్తరాఖండ్‌కు టూర్‌పై వెళ్లిన ఇద్దరు(Hyderabad Tourists Died) చనిపోయారు.
We’re now on WhatsApp. Click to Join
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో టూరిస్టుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా చమోలీ జిల్లాలో కర్ణప్రయాగ, గౌచర్ మధ్యలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు టూరిస్టులు చనిపోయారు. శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చనిపోయిన వారిని హైదరాబాద్‌కు చెందిన నిర్మల్ షాహీ (36), సత్య నారాయణ (50)గా గుర్తించారు. పవిత్ర బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని బైక్‌పై వస్తుండగా.. మార్గమధ్యంలో వారిపై కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారిద్దరి డెడ్ బాడీస్‌ను శిథిలాల నుంచి బయటకు తీసి పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించామని స్థానిక అధికార వర్గాలు వెల్లడించాయి.
Also Read :Union Budget 2024 : 22 నుంచి పార్లమెంటు సమావేశాలు.. 23న కేంద్ర బడ్జెట్
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ – కేదార్నాథ్ జాతీయ రహదారిపైనా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆదివారం రోజు కూడా ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ కూడా ఉత్తరాఖండ్‌లోని(uttarakhand) ప్రభావిత ప్రాంతాల స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార వర్గాలు సూచించాయి. సహాయక చర్యలు చేపట్టేందుకు రెస్క్యూ టీమ్స్‌ను సిద్ధంగా ఉంచారు.
Also Read :IND vs ZIM: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
మరోవైపు ఈశాన్య రాష్ట్రాలు కూడా వరదలతో అల్లకల్లోలం అవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మణిపూర్‌లోని ఇంఫాల్ పశ్చిమ, ఇంఫాల్ తూర్పు జిల్లాల్లో రెండు ప్రధాన నదుల గట్టు తెగిపోయింది. దీంతో అనేక గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. ఫలితంగా ముంపు ప్రాంతాల నుంచి వేల మంది ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలో 1,300 మంది, ఇంఫాల్ వెస్ట్‌లో దాదాపు 700 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నాగాలాండ్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.