Photo Morphing Case : కొండా సురేఖ – ఎంపీ రఘునందన్ రావు ఫొటోస్ మార్ఫింగ్ కేసులో ఇద్దరి అరెస్ట్
Photo Morphing Case : ఆ మధ్య దుబ్బాకలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరు కాగా.. ఆమె స్వాగతించే క్రమంలో బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు
- By Sudheer Published Date - 08:30 PM, Tue - 15 October 24

మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) – ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) ల ఫోటో మార్ఫింగ్ (Photo Morphing) కేసు లో పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ మధ్య దుబ్బాకలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరు కాగా.. ఆమె స్వాగతించే క్రమంలో బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు.. చేనేతలు నూలు దారంతో తయారు చేసిన దండ వేశారు. అయితే.. దీనిపై కొందరు ట్విట్టర్ వేదికగా ట్రోలింగ్ చేయడమే కాక వారిద్దరి ఫోటోలను మార్ఫింగ్ చేసి నానా రచ్చ చేసారు. దీనిపై కొండాసురేఖ కన్నీరు కూడా పెట్టుకున్నారు. ఓ మహిళను ఇలా చేయొచ్చా..? అని ప్రశ్నించారు. ఇక దీనిపై రఘునందన్ పోలీసులకు పిర్యాదు చేసారు.
కేటీఆర్, హరీశ్ రావులతో పాటు పలు యూట్యూబ్ ఛానళ్లపై కూడా రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఆ వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ క్రైమ్‌తో పాటు దుబ్బాక పోలీస్ స్టేషన్‌లో కూడా కంప్లైంట్ చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా కోనాపూర్‌కు చెందిన మాజీ సర్పంచ్ దేవన్న, జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి మహేశ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులు(Cyber crime police) తెలిపారు. రఘునందన్ రావు ఫిర్యాదు మేరకు వీరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
Read Also : Murine Typhus : కేరళలో మురిన్ టైఫస్ వ్యాధి.. ఈ వ్యాధి ఏమిటి, ఇది ఎంత ప్రమాదకరమైనది..?