TSPSC: గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రిలిమ్స్ ప్రాథమిక కీ విడుదల..!
ఇటీవల జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తాజాగా రిలీజ్ చేసింది.
- By Gopichand Published Date - 10:55 AM, Sun - 30 October 22
ఇటీవల జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తాజాగా రిలీజ్ చేసింది. దీంతోపాటు అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను కూడా వెబ్ సైటులో అందుబాటులో ఉంచింది. మెుత్తం 2,85,916 మంది అభ్యర్థుల డిజిజల్ ఓఎంఆర్ షీట్లను వెబ్ సైట్ లో ఉంచారు. టీఎస్పీఎస్సీ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేసి జవాబు పత్రాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇవి వెబ్ సైట్ లో నవంబర్ 29 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని TSPSC పేర్కొంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కీ, ఓఎంఆర్ సమాధాన పత్రాలతో పాటు ప్రశ్నపత్రాన్ని కూడా టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది.
ప్రాథమిక కీపై అక్టోబర్ 31 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈ-మెయిల్, వ్యక్తిగత అభ్యంతరాలు స్వీకరించమని కమిషన్ స్పష్టం చేసింది. అభ్యంతరాలకు సంబంధించిన ఫ్రూవ్స్ ను కూడా లింక్ లో పీడీఎఫ్ ద్వారా జతపర్చాలని టీఎస్పీఎస్సీ పేర్కొంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ విడుదల చేయడంతో అభ్యర్థుల్లో ఉన్న గందరగోళానికి తెరపడినట్లయింది. ప్రిలిమనరీ ఎగ్జామ్ లో వివిధ సిరీస్ లలో ప్రశ్నలతోపాటు సమాధానాలను కూడా జంబ్లింగ్ చేసి బహుళ సిరీస్ ల్లో ప్రశ్నాపత్రాలను రూపొందించింది టీఎస్పీఎస్సీ. వాటిన్నింటికీ మాస్టర్ గా ఉన్న ప్రశ్నపత్రాన్ని, దాని ప్రాథమిక కీను కమిషన్ వెబ్ సైట్ లో ఉంచింది. TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు రెండు నెలల్లో విడుదలయ్యే అవకాశముంది. ఇటీవల TSPSC గ్రూప్- 1 ప్రిలిమ్స్ కోసం కనీస అర్హత మార్కులను తొలగించిన విషయం తెలిసిందే. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారు మెయిన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. మెరిట్ జాబితాను తయారు చేసేందుకు మెయిన్స్‌లో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
Related News
Group 1 Question Paper : గ్రూప్-1 ప్రశ్నాపత్రంలో ట్రాన్స్లేషన్ దోషాలు.. అభ్యర్థుల టైం వేస్ట్!
Group 1 Question Paper : ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది.