TSPSC Exams : టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం.. మరో రెండు నియామక పరీక్షల తేదీలు ఖరారు
ఇప్పటికే దఫాల వారీగా పరీక్షలు నిర్వహిస్తున్న టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) మరో రెండు నియామక పరీక్షల తేదీలను మంగళవారం ప్రకటించింది.
- Author : News Desk
Date : 23-05-2023 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా పలు పరీక్షలు రద్దయిన విషయం విధితమే. ఇప్పటికే దఫాల వారీగా పరీక్షలు నిర్వహిస్తున్న టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) మరో రెండు నియామక పరీక్షల తేదీలను మంగళవారం ప్రకటించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో అకౌంట్స్ ఆఫీసర్ నియామక పరీక్ష ఆగస్టు 8న నిర్వహించాలని నిర్ణయించగా.. సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 10 వరకు జూనియర్ లెక్చరర్ల నియామక పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది.
టీఎస్‌పీఎస్సీ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపిన విషయం విదితమే. పేపర్ లీకేజీ నిర్ధారణ కావడంతో అప్పటికే నిర్వహించిన, నిర్వహించాల్సిన ఏడు పరీక్షలను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసిన విషయం విధితమే. ఆ తరువాత కొన్ని పరీక్షల నిర్వహణకు తేదీలనుసైతం ప్రకటించింది. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం నేపథ్యంలో జూలై నెలలో జరగాల్సిన జూనియర్ లెక్చరర్ పరీక్షలను కూడా టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసిన విషయం విధితమే.
తాజాగా ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించిన తేదీలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 10వరకు జూనియర్ లెక్చరర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా గతంలో వాయిదా పడిన అకౌంట్స్ ఆఫీసర్ నియామక పరీక్షను ఆగస్టు 8న ని ర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది.
Also Read : YS Sharmila : పెద్ద దొర, చిన్న దొర అంటూ.. కేసీఆర్, కేటీఆర్ పై షర్మిల విమర్శలు