KCR Sensational Comments on Munugode: మునుగోడు బై ఎలక్షన్ పై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!
ప్రగతిభవన్ వేదికగా జరిగిన TRSLPసమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నికల్లో టీఆరెస్ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
- Author : hashtagu
Date : 03-09-2022 - 8:45 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రగతిభవన్ వేదికగా జరిగిన TRSLPసమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నికల్లో టీఆరెస్ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ బై ఎలక్షన్ లో రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బీజేపీ ఉంటుందని సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. ప్రతి ఎమ్మెల్యేలకు రెండు గ్రామాల చొప్పున బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఉపఎన్నికలో తమ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు జంకేదిలేదన్నారు. అసలు బీజేపీ బెదిరింపులను పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్నారు. మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ఆటలు కొనసాగినట్లు ఇక్కడ సాగవన్నారు.
ఇక టీఆరెస్ఎల్సీ భేటీ కి ముందు జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2022 సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. సెప్టెంబర్ 16, 17,18 తేదీల్లో 3రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్ణయించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.