TRSLP: 15న టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్…గులాబీ బాస్ ఏం చెబుతారో…!!
- By hashtagu Published Date - 07:25 PM, Sun - 13 November 22

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఎల్లుండి టీఆర్ఎస్ఎల్పీ సమావేశం కానుంది. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో సంయుక్త సమావేశం జరగుతుంది. మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ కు శాసనసభసభ్యుల, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులతోపాటు టీఆర్ఎస్ రాష్ట్రస్థాయి నేతలు కూడా పాల్గొనున్నారు.
గత సెప్టెంబర్ నెలలో తెలంగాణ భవన్ లో సీఎం అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకత్వం అంతా హాజరైంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్ధితులు రాజకీయ పరిణామాలతోపాటు పలు అంశాలపై చర్చించారు. అయితే టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కు కంటే ముందు ప్రగతి భవన్ లో మంత్రి వర్గం సమావేశం నిర్వహించారు. మూడు గంటలపాటు ఈ సమావేవం జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు మంత్రులు. సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యత దినంగా పాటించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 16,17,18 తేదీల్లో మూడు రోజులపాటు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కేబినెట్ డిసైడ్ చేసింది.
అయితే ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికలో గులాబీ పార్టీ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పై మరింత ఫోకస్ పెట్టేందుకు రెడీ అయ్యారు సీఎం కేసీఆర్. అయితే ఇదే అంశానికి సంబంధించి ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు నేతలకు ఏమైనా సలహాలుసూచనలు ఇవ్వనున్నారా అనేది దానిపై ఉత్కంఠ నెలకొంది.