L.Ramana: ఈడీ ఎంక్వైరీ.. రమణకు అస్వస్థత!
క్యాసిన్, ఇతర ఆరోపణల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్
- By Balu J Published Date - 04:57 PM, Fri - 18 November 22

క్యాసిన్, ఇతర ఆరోపణల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఈడీ ముందు హాజరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ ఎదుర్కోవాల్సి వచ్చింది. చికోటి ప్రవీణ్ కేసినో ఈవెంట్లకు సంబంధించి రమణ కూడా వినిపించింది. ఇందులో భాగంగా ఆయన ఇవాళ ఈడీ విచారణ నిమిత్తం వెళ్లారు. లిప్ట్‌లో కాకుండా పై అంతస్తులో వున్న ఈడీ ఆఫీస్‌కు నడుచుకుంటూ వెళ్లారు. బీపీ డౌన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు. ఈడీ అధికారులను అడిగి నీళ్లు తెప్పించుకుని తాగారు. కాసేపు సేద తీరినప్పటికీ ఆరోగ్యం కుదుటపడలేదు.
తన ఆరోగ్య పరిస్థితి బాగా లేదని ఈడీ అధికారుల దృష్టికి ఎల్.రమణ తీసుకెళ్లారు. దీంతో ఆయన్ను నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి ఈడీ అధికారులు తరలించారు. రమణ సుదీర్ఘ కాలం పాటు టీడీపీలో ఉన్న సంగతి తెలిసిందే. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పని చేశారు. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్ లేదనే ఉద్దేశంతో టీఆర్ఎస్ వైపు ఆయన వెళ్లారు.