HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Trs Leader Cousin Fire In The Air At Farmhouse

TRS Leader: గాల్లో కాల్పులు జరిపిన టీఆర్ఎస్ నేత బంధువు

వివాదాస్పద అంశాలు అధికార పార్టీ టీఆర్ఎస్ ను వెంటాడుతున్నాయి.

  • Author : Balu J Date : 16-08-2022 - 12:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Air Gun
Air Gun

వివాదాస్పద అంశాలు అధికార పార్టీ టీఆర్ఎస్ ను వెంటాడుతున్నాయి. మొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ గాల్లోకి కాల్పుల జరిపిన విషయం మరువకముందే, తాజాగా మరో టీఆర్ఎస్ నేత బంధువు గాల్లోకి కాల్పులు జరపడం చర్చనీయాంశమవుతోంది. ఇద్దరు వ్యక్తులు ఎయిర్ రైఫిల్‌తో గాలిలోకి కాల్పులు జరుపుతున్న వీడియోలు ఆలస్యంగా సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. యాచారం పోలీస్‌ పరిధిలోని నాజ్‌దిక్‌ సింగారం గ్రామంలోని ఫామ్‌హౌస్‌లో టీఆర్‌ఎస్‌కు చెందిన విఘ్నేశ్వర్‌రెడ్డి తన బంధువు విక్రమ్‌తో కలిసి కాల్పులు జరిపినట్టు వీడియోల్లో చూడొచ్చు.

జులై 14న జరిగిన ఈ ఘటనలో సోమవారం వీడియో వైరల్‌గా మారినప్పటికీ ఎయిర్‌గన్‌ను ఉపయోగించినట్లు యాచారం ఇన్‌స్పెక్టర్ ఎస్.లింగయ్య తెలిపారు. “మేం ఎయిర్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకుని పరీక్షకు పంపాం. ఎయిర్ రైఫిల్‌కు ఆయుధాల లైసెన్స్ అవసరం లేదని భారతీయ ఆయుధాల చట్టం పరిధిలోకి రాదని ప్రాథమికంగా కనుగొనబడింది. వారిని పిలిపించి విచారణ జరుపుతున్నాం. దాని ప్రకారం ముందుకు సాగుతాం’’ అని లింగయ్య తెలిపారు. ఫామ్‌హౌస్‌లో పుట్టినరోజు వేడుక కోసం దాదాపు 15 మంది యువకులు గుమిగూడారని, ఆ సమయంలో ఎయిర్ రైఫిల్ తో కాల్లులు జరిపారని ఎస్ఐ తెలిపారు. కాగా, ఈ ప్రాంతంలో తమ రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేక ప్రత్యర్థులు తమపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని విఘ్నేశ్వర్ రెడ్డి ఆరోపించారు. “నేను ఎటువంటి చట్టవిరుద్ధమైన లేదా సంఘ వ్యతిరేక కార్యకలాపాలలో ఎప్పుడూ పాల్గొనలేదు,” అని అతను చెప్పాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • airgun issue
  • hyderabad
  • police case
  • TRS leader

Related News

Death

Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

హైద‌రాబాద్‌లో మైన‌ర్ బాలిక ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతుంది. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌ పాల్పడే ముందు ఆమె సూసైడ్ నోట్ రాసిన‌ట్లు స‌మాచారం. కుటుంబ సభ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అదే ప్రాంతంలో నివసిస్తున్న ఒక యువకుడి నుంచి ఆమె వేధింపులకు గురవుతోంద‌ని..కొంతకాలంగా భావోద్వేగ, మానసిక క్షోభకు గురవుతోందని వారు తెలిపారు. ఘటన జరిగిన తర్వా

  • Pavan Kalyan (1)

    JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

  • RCB FANS

    HYD : ఐపీఎల్ సంబ‌రాలు.. హైద‌రాబాద్‌లో ఆర్సీబీ అభిమానుల ర‌చ్చ‌.. పోలీసుల లాఠీఛార్జ్‌

  • HYDRAA

    HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • World Ivf Day

    IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

Latest News

  • Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd