P.Vijaya Reddy: కాంగ్రెస్‌లో చేరిన పీజేఆర్ కూతురు!
కార్మిక నేత పీజేఆర్ కూతురు విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్ఎస్ లో కర్పొరేటర్ గా కొనసాగిన ఈమె ఆ పార్టీ గుడ్ బై చెప్పారు.
- By Balu J Updated On - 05:14 PM, Thu - 23 June 22

కార్మిక నేత పీజేఆర్ కూతురు విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్ఎస్ లో కర్పొరేటర్ గా కొనసాగిన ఈమె ఆ పార్టీ గుడ్ బై చెప్పారు. గురువారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో విజయారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా విజయారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఖైరతబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను పార్టీ మారడం ఒక్క రోజు తీసుకున్న నిర్ణయం కాదు. దేశంలో, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఘటనలు నన్ను బాధించాయి. షీ టీమ్‌లు పెట్టామని గొప్పగా చెప్పుకుంటున్నా మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. పెన్షన్, రేషన్ కార్డుల కోసం పేదలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.రాష్ట్ర ప్రజల బాగోగులు పక్కన పెట్టారు. కాంగ్రెస్ మాత్రమే పేదలకు న్యాయం చేస్తుంది. సోనియా, రాహుల్ నాయకత్వంలో పని చేయడానికే కాంగ్రెస్‌లోకి వచ్చాను అని విజయారెడ్డి అన్నారు.
Related News

Uttam Kumar Reddy : అవినీతికి పాల్పడుతున్న అధికారపార్టీ నేతలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారు – ఎంపీ ఉత్తమ్
అవినీతికి పాల్పడిన టీఆర్‌ఎస్ నాయకులను రక్షించేందుకు తెలంగాణ పోలీసులు పని చేస్తున్నారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జర్నలిస్టులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇతర సామాజిక కార్యకర్తలపై అన్యాయంగా పోలీసులు కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. స్థానిక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ఆయన అనుచరుల అవినీతిని బయటపెట్టినందుకు స్థానిక జర్న