Revanth@Khairatabad: మహాగణపతి ఆశీర్వాదంతో మతసామరస్యం వర్ధిల్లాలి!
గణపతి ఉత్సవాలు అంటే గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి మాత్రమే అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
- Author : Balu J
Date : 05-09-2022 - 10:54 IST
Published By : Hashtagu Telugu Desk
గణపతి ఉత్సవాలు అంటే గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి మాత్రమే అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి ఆయన ఖైరతాబాద్ గణేషుడ్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో సర్వమతాల సమైక్యతను చాటడానికి గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారని అన్నారు. మతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని, ప్రపంచానికే ఆదర్షంగా ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు.
ఈ గణపతి ఆశీర్వాదంతో రాష్ట్రంలో వర్షాలు కురవాలి, మతసామరస్యం వర్ధిల్లాలి అని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్ నగరాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దేదుకు ఆనాటి నుంచి కాంగ్రెస్ ఎంతో కృషి చేసింది అని, భవిష్యత్ లో నగరానికి పెట్టుబడులు తీసుకువచ్చి.. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది అని రేవంత్ రెడ్డి తెలియజేశారు.