MLC By Election : తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అవుతారా ? ఇవాళే కౌంటింగ్
ఇవాళ వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది.
- By Pasha Published Date - 07:56 AM, Wed - 5 June 24

MLC By Election : ఇవాళ ఉదయం 8 గంటలకు వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. నల్లగొండ పట్టణ శివారులోని ఎ.దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములో దీనికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లను ఇవాళ కౌంట్ చేయనున్నారు. మొత్తం నాలుగు హాళ్లల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఒక్కో హాల్లో 24 లెక్కింపు టేబుళ్ల చొప్పున మొత్తం 96 టేబుళ్లను ఓట్ల కౌంటింగ్ కోసం ఏర్పాటు చేశారు.
We’re now on WhatsApp. Click to Join
ఇందుకోసం 2,100 మంది సిబ్బందిని కేటాయించారు. ఈ ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న(MLC By Election), బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేశ్‌రెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ ఎన్నికల బరిలో ఉన్నారు. మరో 49 మంది అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో కౌంటింగ్ లేట్ అవుతుంది. తుది ఫలితం తేలేందుకు అర్ధరాత్రి అయ్యే అవకాశముంది.
Also Read :Pawan Kalyan: ఏపీ ఎన్నికల్లో పవన్ ప్రభంజనం.. ‘ధర్మం దే విజయం’ అంటూ కొత్త పోస్టర్
- మొత్తం నాలుగు కౌంటింగ్ హాల్స్ ఉన్నాయి. వాటిలో ఒక్కో హాల్‌లో 24 టేబుళ్ల చొప్పున మొత్తం 96 టేబుళ్లపై లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. వీటిపై ముందుగా బ్యాలెట్ పత్రాలను కట్టలు కడుతారు.
- 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను వరుస క్రమంలో టేబుల్‌కు ఒకటి ఇచ్చి ఒపెన్ చేస్తారు.
- బ్యాలెట్ బాక్సుల్లోని బ్యాలెట్ పేపర్లను టేబుల్‌పై కుప్పగా పోసి 25 పేపర్లను ఒక కట్టగా చేసి బండిల్స్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్లను కూడా ఇదే సమయంలో వీటితో కలిపేస్తారు.
- ఎప్పటికప్పుడు వీటిన్నింటిని తీసుకెళ్లి ఓ పెద్ద డ్రమ్‌లో వేస్తారు.
- బండిల్ కార్యక్రమం పూర్తయ్యాక అసలు లెక్కింపు మొదలుకానుంది.
- తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లపై.. గెలుపు బాటలో ఉన్నవారిపై స్పష్టత వస్తుంది.
- ఏ అభ్యర్థి కూడా గెలుపు కోటా ఓట్లు సాధించలేకపోతే ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెడతారు.
- తొలి ప్రాధాన్యత ఓట్లలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ రౌండ్‌ను ప్రారంభిస్తారు.
- ఒక్కో అభ్యర్థిని కిందినుంచి పైకి ఎలిమినేట్ చేస్తూ కౌంటింగ్ చేస్తారు.
- గెలుపునకు అవసరమైన ఓట్లు ఎక్కువగా వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు.