Kaloji Narayana Raos Birth Anniversary : కాళోజీ జయంతి నేడే.. ఆ మహామనిషి జీవితంలోని కీలక ఘట్టాలివీ
తెలంగాణ రచయిత కాళోజీ నారాయణరావు(Kaloji Narayana Raos Birth Anniversary) 100వ జయంతి సందర్భంగా..ఆయన పుట్టినరోజైన సెప్టెంబరు 9వ తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం.
- Author : Pasha
Date : 09-09-2024 - 11:25 IST
Published By : Hashtagu Telugu Desk
Kaloji Narayana Raos Birth Anniversary : ఇవాళ ప్రజాకవి కాళోజీ జయంతి. ‘‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’’ అనే గొప్ప సందేశాన్ని ఇచ్చిన మహానుభావుడు కాళోజీ. ఆంధ్ర సారస్వత పరిషత్ స్థాపకుల్లో ఈయన కూడా ఒకరు. నిజాం నవాబు తెలంగాణను పాలిస్తున్న టైంలో 1945లో రజాకార్లను ఎదిరించి ఆంధ్ర సారస్వత పరిషత్ ద్వితీయ మహాసభలను విజయవంతంగా నిర్వహించారు. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ ‘సామాన్యుడే నా దేవుడు’ అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13న ఈ లోకం విడిచి వెళ్లారు. ఆయన మరణానంతరం కాళోజీ పార్థివ దేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి అందజేశారు. తెలంగాణ రచయిత కాళోజీ నారాయణరావు(Kaloji Narayana Raos Birth Anniversary) 100వ జయంతి సందర్భంగా..ఆయన పుట్టినరోజైన సెప్టెంబరు 9వ తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఆ మహా మనిషి జీవితంలోని కొన్ని ఆసక్తికర వివరాలివీ..
Also Read :HYD Police Commissioner CV Anand : హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
- కాళోజీ 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా రట్టిహళ్లి గ్రామంలో జన్మించారు. ఆయన తల్లి రమాబాయమ్మ కన్నడ మహిళ. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు.
- కాళోజీ విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ధిక్కరించి మాట్లాడారు. నిజాం హుకుంను వ్యతిరేకిస్తూ వరంగల్‌లో గణపతి ఉత్సవాలను నిర్వహించారు.
- వరంగల్ కోటలో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినందుకు.. అప్పట్లో కాళోజీకి నిజాం నవాబు నగర బహిష్కరణ శిక్ష విధించాడు.
- ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వాళ్లను నాగపూర్ యూనివర్సిటీలో చేర్పించి ఆదుకుంది కాళోజీయే.
- 1958లో ఆయన ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
- 1958 నుంచి 1960 వరకు కాళోజీ ఎమ్మెల్సీగా సేవలు అందించారు. ఆ రెండేళ్ల పాటు ఆయన ఏ పార్టీకి చెందని స్వతంత్ర సభ్యుడిగా వ్యవహరించారు.
- కాకతీయ యూనివర్సిటీ కాళోజీకి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
- భారత ప్రభుత్వం కాళోజీని పద్మవిభూషణ్‌తో సత్కరించింది.