HYD Police Commissioner CV Anand : హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆనంద్‌కు ఏసీబీ డీజీగా బాధ్యతలను(HYD Police Commissioner CV Anand) అప్పగించారు.
- By Pasha Published Date - 10:47 AM, Mon - 9 September 24

HYD Police Commissioner CV Anand : సీవీ ఆనంద్.. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా ఇవాళ ఉదయం బాధ్యతలను స్వీకరించారు. ఈసందర్భంగా సీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆనంద్‌కు ఏసీబీ డీజీగా బాధ్యతలను(HYD Police Commissioner CV Anand) అప్పగించారు. ఇప్పుడు మరోసారి ఆయనకు హైదరాబాద్ సీపీగా అవకాశం కల్పించారు. వాస్తవానికి సీవీ ఆనంద్ 2021 డిసెంబర్ నుంచి 2023 అక్టోబర్ వరకు హైదరాబాద్ సీపీగా సేవలు అందించారు. 2023 ఎన్నికల టైంలో ఆయనను సీపీ పదవి నుంచి తప్పించారు.
Also Read :Production Moving To China : ఉత్పత్తి రంగంలో చైనా రారాజు.. భారత్ తలుచుకున్నా అది సాధ్యమే : రాహుల్ గాంధీ
- సీవీ ఆనంద్ తెలంగాణ క్యాడర్‌కు చెందిన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.
- ఈయనకు 2017లో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పదోన్నతి లభించింది.
- అనంతరం కేంద్ర సర్వీసులకు వెళ్లిన సీవీ ఆనంద్ 2021లో తిరిగి తెలంగాణకు చేరుకున్నారు.
- 2023 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు డీజీపీ హోదా కల్పించింది.
- ఇంతకుముందు వరకు హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా వ్యవహరించిన కొత్తకోట శ్రీనివాసరెడ్డిని హఠాత్తుగా బదిలీ చేసిన సర్కారు.. ఆ స్థానంలో సీవీ ఆనంద్‌కు ఛాన్స్ ఇచ్చింది.
- గత ఏడాది వ్యవధిలో హైదరాబాద్‌కు నలుగురు పోలీసు కమిషనర్లను నియమించారు. గత ఏడాది కాలంలో తొలుత సీవీ ఆనంద్‌కు, ఆ తర్వాత శాండిల్య, కొత్తకోట శ్రీనివాసరెడ్డిలకు అవకాశం కల్పించారు. ఇప్పుడు హైదరాబాద్ సిటీకి నాలుగో కమిషనర్‌గా మళ్లీ సీవీ ఆనంద్‌కే ఛాన్స్ ఇచ్చారు.
- హైదరాబాద్ నగరానికి 61వ పోలీసు కమిషనర్‌గా ఆనంద్ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు.
- హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు 177 ఏళ్ల చరిత్ర ఉంది.
- ఇప్పటి వరకు ఏడుగురికి మాత్రమే రెండోసారి హైదరాబాద్ నగర పోలీసు చీఫ్‌గా పని చేసే అవకాశం దక్కింది. గతంలో సి.రంగస్వామి అయ్యంగర్, బీఎన్ కాలియా రావు, ఎస్‌పీ సత్తారు, కె.విజయరామారావు, ఆర్.ప్రభాకర్‌రావు, వి.అప్పారావు, ఆర్పీ సింగ్‌లకు మాత్రమే ఈ ఛాన్స్ వచ్చింది. 2003లో ఆర్పీ సింగ్ తర్వాత 21 ఏళ్లకు సీవీ ఆనంద్ ఈ అరుదైన రికార్డు సాధించారు.