HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tiffins And Meals Rates Sky Rocketing In Hyderabad

Tiffins & Meals Cost: హైదరాబాద్ లో భోజనం రూ.150.. టిఫిన్ రూ.50 పైనే!.. ఎక్కడ తక్కువంటే…!

  • Author : hashtagu Date : 10-04-2022 - 2:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
78
78

మీకు పూరీ తినాలనుందా? కష్టం. మీకు దోశ తినాలని ఉందా? వద్దులే మళ్లీ వారం ట్రై చేద్దాం అని అనక తప్పదు. సరే.. ఇవన్నీ ఎందుకు ఉదయం పస్తు ఉండి.. మధ్యాహ్నం గట్టిగా ఫుల్ మీల్స్ లాగించేద్దాం అనుకుంటున్నారా… అయినా దాని రేటు చూస్తే.. తినకముందే ఆకలి చచ్చిపోతుంది. ఎందుకంటే.. హైదరాబాద్ లో ఇప్పుడు టిఫిన్ల ధరలు దారుణంగా పెరిగిపోయాయి. నిత్యావసరాల ధర పెరుగుదల ఎఫెక్ట్ వీటిపై కనిపిస్తోంది.

పూరీ కాని, వడ కాని, ఇడ్లీ కాని, బజ్జీ కాని.. ఏదైనా కాని తిందామని ఆశపడినా వాటి రేట్లు చూసి మనసు చంపుకోక తప్పని పరిస్థితి. ఎందుకంటే ప్లేటు టిఫిన్ రేటు ఐదు రూపాయిల నుంచి పది రూపాయిల వరకు పెరిగిపోయింది. ఇక భోజనంతోపాటు ఇతర వంటకాల ధర 15 రూపాయిల పైనే పెరిగింది. మామూలు హోటళ్లలో టిఫిన్ రేట్లు ఇప్పటివరకు సుమారుగా రూ.30-40 ఉంటే.. ఇప్పుడు ఆ రేటు కాస్తా రూ.50.. ఆ పైనే ఉంది. అదే భోజనం సంగతి చూస్తే.. మామూలు హోటళ్లలో రూ.90 ఉండేది. ఇప్పుడది రూ.110 అయిపోయింది. ఇక మధ్యస్థాయి హోటళ్లలో ఈ రేటు కాస్తా.. రూ.150 అయిపోయింది.

పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడంతో పప్పుల ధరలు. 15-20 శాతం పెరిగాయి. నూనె ధర డబుల్ అయ్యింది. అంటే రూ.100 మేర పెరిగింది. వంట గ్యాస్ బండ బాదుడు బాదింది. ఎండుమిర్చి సంగతి చెప్పక్కరలేదు. అందుకే రంజాన్ నెలలో దొరికే హలీం రేటు కూడా పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని రకాల హోటళ్లు కలిపి దాదాపు 17 వేలు ఉండేవి. కరోనా దెబ్బకి చిన్నహోటళ్లు దాదాపు 2000 మేర మూతపడ్డాయి. ఇప్పుడు మిగిలిన హోటళ్లపై ఈ రేటు తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Meals Cost
  • Tiffins Cost

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

    Latest News

    • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

    • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

    • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

    • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

    • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd