HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >This Is How The Gulzar House Fire Incident Happened In Hyderabad

Hyderabad Fire : హైదరాబాద్‌లో గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాద ఘటన.. ఇలా జరిగింది

గుల్జార్‌ హౌస్‌(Hyderabad Fire) భవనం మొదటి అంతస్తులో ఒక వ్యాపారి కుటుంబం నివసిస్తోంది.  ఈ భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు.

  • Author : Pasha Date : 18-05-2025 - 1:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gulzar House Fire Accident Hyderabad Fire

Hyderabad Fire : హైదరాబాద్ నగరంలో సండే వేళ  విషాద ఘటన చోటుచేసుకుంది. చార్మినార్‌ సమీపంలోని గుల్జార్‌ హౌస్‌ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 17 మంది చనిపోయారు. ఇంకొంత మంది ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎలా జరిగింది ? ఈ అగ్ని ప్రమాదానికి కారణమేంటి ? అంతమంది ఎలా చనిపోయారు ?  తెలుసుకుందాం..

Also Read :Pakistan Copying : భారత్‌ను కాపీ కొట్టిన పాక్.. ప్రపంచదేశాలకు ‘పీస్ మిషన్’.. భుట్టో సారథ్యం

ప్రమాద ఘటన ఇలా జరిగింది..  

  • గుల్జార్‌ హౌస్‌(Hyderabad Fire) భవనం మొదటి అంతస్తులో ఒక వ్యాపారి కుటుంబం నివసిస్తోంది.  ఈ భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు.
  • ఇప్పుడు వేసవి సెలవులు ఉండటంతో  ఆ వ్యాపారి ఇంటికి బంధువులు వచ్చారు.
  • ఈరోజు (ఆదివారం) ఉదయాన్నే షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల వ్యాపారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది.  అప్పటికి అందరూ నిద్రలో ఉన్నారు.
  • అగ్ని ప్రమాదం వల్ల పెద్ద ఎత్తున  మంటలు చెలరేగాయి.  దీంతో ఇంటిని పొగ కమ్ముకుంది.
  • పొగ వల్ల ఊపిరాడక ఇంట్లోని పలువురు స్పృహ తప్పి పడిపోయారు.
  • గుల్జార్‌ హౌస్‌ భవనం మొదటి అంతస్తులోని వ్యాపారి ఇంటి నుంచి కిందికి దిగడానికి ఒకే మెట్ల మార్గం ఉంది. దీంతో సహాయక చర్యలు వేగంగా జరగలేదు.
  • ఈ కారణంతో నిచ్చెనలతో అగ్నిమాపక సిబ్బంది మొదటి అంతస్తులోకి వెళ్లారు. మంటలను ఆర్పారు.
  • ఇంట్లోకి వెళ్లే మార్గం లేకపోవడంతో..  తలుపులను పగులగొట్టి స్పృహ తప్పి ఉన్న వారిని బయటకు తీసుకొచ్చారు.
  • ఆ వెంటనే వారిని అంబులెన్స్‌లలో ఆస్పత్రులకు తరలించారు.
  • ఈక్రమంలో కొందరు మార్గంమధ్యలోనే చనిపోయారు.
  • చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు.
  • ఈ ఘటనతో గుల్జార్‌ హౌస్‌ పరిసరాలను దట్టంగా పొగ కమ్మేసింది. దీంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందిపడ్డారు.
  • ఇంటిలో చెక్కతో చేసిన ప్యానెళ్లు ఉన్నాయి. వాటివల్లే మంటలు వ్యాపించాయి. విద్యుదాఘాతంతో చెక్క మొత్తం కాలి మంటలు వచ్చాయి.
  • ప్రమాదం జరిగిన సమయానికి మొదటి అంతస్తులో మొత్తం 17 మంది ఉన్నారు. ఇప్పటివరకు 17 మంది చనిపోయారు.
  • గుల్జార్‌ హౌస్‌ భవనంలో విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన మెయిన్‌ వద్ద నిత్యం విద్యుదాఘాతం జరుగుతోందని స్థానికులు తెలిపారు.  ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే ఈ ప్రమాదమే జరిగేది కాదన్నారు.

Also Read :Diplomatic War : శశిథరూర్‌‌కు పెద్ద బాధ్యతలు.. అఖిలపక్ష టీమ్‌లు పర్యటించే దేశాలివీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • Gulzar House
  • Gulzar House Fire Accident
  • Gulzar House Fire Incident
  • hyderabad
  • Hyderabad Fire

Related News

Christmas Holidays 2025 Sch

విద్యార్థులకు శుభవార్త..క్రిస్మస్ సెలవులు వచ్చేశాయ్!

christmas Holidays 2025 : విద్యార్థులకు ఇది ఎగిరి గంతేసే వార్త.. క్రిస్మస్ సెలవులు ప్రకటించారు. డిసెంబర్ 25, 26 క్రిస్టమస్, బాక్సింగ్ డే సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు మాత్రం 5 రోజుల సెలవులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. గతంలో క్రిస్మస్ సందర్భంగా వారం నుంచి పది రోజులు సెలవులు ఇచ్చే వారు. అయితే ఈసారి అవి చాలా వరకు తగ్గిపోయాయి. దీనిపై త్వరలోనే అధ

  • Chief Election Commissioner Gyanesh Kumar's visit to Telugu states

    తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ పర్యటన

  • CM Revanth Leadership

    సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

  • Bullet Railway Andhra Prade

    ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!

  • KTR

    కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్‌ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్

Latest News

  • వారం రోజుల్లోనే బరువు తగ్గించే డైట్.!

  • సౌతాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న భార‌త్‌!

  • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

  • జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

  • టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంక‌కు కొత్త కెప్టెన్‌!

Trending News

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd