HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >This Is A Revolution Not An Idol Cm Kcr

CM KCR: ఇది విగ్రహం కాదు విప్లవం: అంబేద్కర్ విగ్రహావిష్కరణలో కేసీఆర్!

బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ప్ర‌కాశ్ అంబేద్క‌ర్‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవిష్క‌రించారు.

  • Author : Balu J Date : 14-04-2023 - 6:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ambedkar
Ambedkar

రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ (Hyderabad) న‌గ‌రం న‌డిబొడ్డున హుస్సేన్ సాగ‌ర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ప్ర‌కాశ్ అంబేద్క‌ర్‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి కేసీఆర్ (CM KCR) ఆవిష్క‌రించారు. విగ్ర‌హావిష్క‌ర‌ణ సంద‌ర్భంగా బౌద్ధ భిక్ష‌వులు ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అంబేద్క‌ర్ విగ్ర‌హంపై హెలికాప్ట‌ర్ ద్వారా గులాబీ పూల వ‌ర్షం కురిపించారు. ఆ పూల వ‌ర్షాన్ని సీఎం కేసీఆర్, ప్ర‌కాశ్ అంబేద్క‌ర్‌తో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు వీక్షించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ జై భీమ్ అని నిన‌దించారు. అక్క‌డున్న ప్ర‌జాప్ర‌తినిధులంతా చ‌ప్పట్ల‌తో పూల వ‌ర్షాన్ని స్వాగ‌తించారు. అంబేద్క‌ర్ విగ్ర‌హా (Staute) శిలాఫ‌ల‌కాన్ని ప్ర‌కాశ్ అంబేద్క‌ర్ ఆవిష్క‌రించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.

అంబేడ్కర్‌ జయంతి (BR Ambedkar) సందర్భంగా.. ఇకపై ఏటా ఆయన పేరిట అవార్డులు ప్రదానం చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ (CM KCR) ప్రకటించారు. కత్తి పద్మారావు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అవార్డుల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రూ.51 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు, దేశమంతా ఏటా 25 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇచ్చే రోజు త్వరలో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లో అంబేడ్కర్‌ మహా విగ్రహావిష్కరణలో కేసీఆర్‌ మాట్లాడారు. అంబేడ్కర్ సిద్ధాంతాలు స్మరణకు వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. తెలంగాణ కలలు సాకారం చేసుకునే చిహ్నం ఈ విగ్రహం అని కెసిఆర్ (CM KCR)  అభివర్ణించారు. విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/04/WhatsApp-Video-2023-04-14-at-5.49.53-PM.mp4


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ambedkar statue
  • cm kcr
  • hyderabad
  • telangana

Related News

Amit Shah makes key remarks on alliances in Telangana.

Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో బీజేపీ పార్టీ పొత్తులకు సంబంధించి కేంద్రమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏ ప్రాంతీయ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఒంటరిగానే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోవడం వల్ల బ

  • Nepali Gang Loots Gold In Hyderabad

    Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

  • Heavy Rain Forecast for Telangana

    తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

Latest News

  • Evening Puja : సాయంత్రం దేవుడిని పూజించేటప్పుడు ఈ మంత్రాలు పఠించండి.. అదృష్టం కలిసి వస్తుంది..!!

  • Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!

  • Pemmasani Chandra Sekhar: ఏపీకి కేంద్రం భారీగా నిధులు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

  • Amaravati: అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు

  • Low BP: లో బీపీ ఉందా.. ఇలా చేస్తే దాని ముప్పు నుంచి బయటపడొచ్చు!!

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd