HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >These Are The Specialities And Arrangements For The Miss World Competition In Telangana This Time

Miss World 2025: తెలంగాణలో మిస్‌ వరల్డ్‌ పోటీలు.. ఏ రోజు ఏం జరుగుతుంది ?

మే 16న ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలకు చెందిన పోటీదారులు మెడికల్‌ టూరిజంలో(Miss World 2025) భాగంగా హైదరాబాద్‌లోని అపోలో, ఏఐజీ, యశోదా ఆస్పత్రులను సందర్శిస్తారు.

  • By Pasha Published Date - 02:40 PM, Fri - 21 March 25
  • daily-hunt
Miss World Pageant 2025 Competition Telangana Hyderabad

Miss World 2025: 72వ మిస్‌ వరల్డ్‌ 2025 పోటీలకు తెలంగాణలోని హైదరాబాద్ మహానగరం ఆతిథ్యం ఇవ్వనుంది. మే 7 నుంచి 31 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఇందుకోసం గచ్చిబౌలి స్టేడియం, గచ్చిబౌలి ఐఎస్బీ, టీ హబ్, శిల్పకళావేదికలను సిద్ధం చేశారు.  మిస్‌ వరల్డ్‌ పోటీలకు   మన దేశం ఆతిథ్యం ఇవ్వడం ఇది మూడోసారి. ఇంతకుముందు ఈ పోటీలు 1996లో బెంగళూరులో, 2024లో ముంబైలో జరిగాయి. ఈసారి హైదరాబాద్‌లో జరగనున్న మిస్‌ వరల్డ్‌ 2025 పోటీల్లో  140 దేశాల సుందరీమణులు పాల్గొనబోతున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే సుందరీమణులు మే 6, 7 తేదీల్లోగా హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.  మే 10న గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక జరుగుతుంది. తెలంగాణ జానపద, గిరిజన నృత్యాభినయ ఇతివృత్తంతో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది.

Also Read :Gautham Ghattamaneni: యాక్టింగ్‌‌తో మెప్పించిన మహేశ్‌‌బాబు కుమారుడు గౌతమ్

మే 12 నుంచి మే 31 వరకు ఏ రోజు ఏం జరుగుతుంది ? 

  • మిస్‌ వరల్డ్‌ పోటీలు జరగనున్న సమయంలో సుందరీమణులు తెలంగాణలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. ఇందుకోసం రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాట్లు చేయనుంది. ఆ పర్యటన సందర్భంలో వారంతా పోచంపల్లి చీరలు ధరించనున్నారు. 40 మంది సుందరీమణులను ఒక బృందంగా ఏర్పాటు చేసి, ఒక్కో బృందాన్ని రాష్ట్రంలోని ఒక్కోచోటకు తీసుకెళ్లనున్నారు.
  • మే 12న వీరికి చెందిన ఒక బృందం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని విజిట్ చేయనుంది.
  • మే 13న సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఓ బృందం చార్మినార్, లాడ్‌బజార్‌లలో హెరిటేజ్‌ వాక్‌ నిర్వహిస్తుంది. అక్కడ షాపింగ్‌ చేస్తారు.
  • మే 13న హైదరాబాద్‌లోని చౌమొహల్లా ప్యాలెస్‌లో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ ఉంటుంది.  ఈసందర్భంగా పోటీదారులకు విందు ఉంటుంది.
  • మే 14న అమెరికా–కరేబియన్‌ ప్రాంతాల పోటీదారులు వరంగల్‌లోని కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉదయం 11 నుంచి 2 వరకు అక్కడ స్థానికులు, విద్యార్థులతో మాట్లాడతారు. ఆ రోజున సాయంత్రం 5 నుంచి 7 వరకు రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తారు.
  • యూరప్‌ దేశాలకు చెందిన పోటీదారుల బృందం మే 15న మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు యాదగిరిగుట్ట దేవాలయాన్ని సందర్శిస్తారు.
  • యూరప్‌ దేశాల సుందీరమణులకు చెందిన రెండో బృందం మే 15న సాయంత్రం పోచంపల్లి గ్రామాన్ని సందర్శిస్తుంది. అక్కడి చేనేత వస్త్ర తయారీ కేంద్రాలను పరిశీలిస్తారు.
  • మే 16న ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలకు చెందిన పోటీదారులు మెడికల్‌ టూరిజంలో(Miss World 2025) భాగంగా హైదరాబాద్‌లోని అపోలో, ఏఐజీ, యశోదా ఆస్పత్రులను సందర్శిస్తారు.
  • మే 17న ఉదయం 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది. అందులో పోటీదారులు పాల్గొంటారు.  అదేరోజు సాయంత్రం హైదరాబాద్ శివారులోని ఎకో టూరిజం పార్కులో జరిగే కల్చరల్, ఫుడ్, ఆర్ట్‌ ఫెస్టివల్‌లో సుందరీమణులు పాల్గొంటారు.
  • హైదరాబాద్ పోలీసింగ్‌ తీరును పరిశీలించేందుకు మే 19న పోటీదారులు పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సందర్శిస్తారు.
  • మే 19న హుస్సేన్‌సాగర్‌ తీరం, అంబేడ్కర్‌ విగ్రహం, సచివాలయం ప్రాంతాలను సందర్శిస్తారు.
  • మే 20, 21 తేదీల్లో టీహబ్‌లో మిస్‌ వరల్డ్‌ కరేబియన్, మిస్‌ వరల్డ్‌ ఆఫ్రికా, మిస్‌ వరల్డ్‌ ఏషియా, ఓషియానియాల మధ్య కాంటినెంటల్‌ ఫినాలే ఉంటుంది.
  • మే 21న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 వరకు శిల్పారామంలో ఆర్ట్స్‌ క్రాఫ్ట్స్ వర్క్‌షాప్‌లో సుందరీమణులు పాల్గొంటారు.
  • మే 22న శిల్పకళావేదికలో టాలెంట్‌ ఫినాలే జరుగుతుంది.
  • మే 23న  గచ్చిబౌలిలోని ఐఎస్బీలో హెడ్‌ టూ హెడ్‌ ఛాలెంజ్‌ ఫినాలే జరుగుతుంది.
  • మే 24న హైటెక్స్‌లో మోడల్‌ అండ్‌ ఫ్యాషన్‌ ఫినాలే జరుగనుంది.
  • మే 25న హైటెక్స్‌లోనే నగలు వజ్రాభరణాల ఫ్యాషన్‌ షో జరుగుతుంది.
  • మే 26న బ్రిటిష్‌ రెసిడెన్సీ, తాజ్‌ ఫలక్‌నుమాలలో పర్పస్‌ ఈవెంట్‌ గలా డిన్నర్‌ ఉంటుంది.
  • మే 31న గ్రాండ్‌ ఫినాలె జరుగుతుంది. ఇది ఆ రోజు సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు కొనసాగుతుంది.
  • మే 31న జరిగే తుదిపోరులో ఏ దేశానికి చెందిన సుందరి విజేతగా నిలుస్తుందో ఆమె, జూన్‌ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటుంది.

Also Read :Campa Vs Pepsi Coke : అంబానీ దెబ్బకు దిగొచ్చిన పెప్సీ, కోకకోలా.. రూ.10కే ఆ డ్రింక్స్‌


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Miss World 2025
  • Miss World Competition
  • Miss World Pageant
  • telangana

Related News

Ramreddy Damodar Reddy

Ramreddy Damodar Reddy: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత.. ఆయ‌న రాజ‌కీయ జీవిత‌మిదే!

మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి ఆయన స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి (శ‌నివారం) సూర్యాపేట జిల్లాలోని స్వగ్రామం తుంగతుర్తిలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి.

  • Dussehra

    Dussehra: రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం రేవంత్‌, కేసీఆర్‌!

  • amrapali ias

    IAS : తెలుగు రాష్ట్రాల్లో ఈ ఐఏఎస్ అధికారిణి గురించి పరిచయం అక్కర్లేదు!

  • Uttam Kumar Reddy

    Uttam Kumar Reddy: వరి కొనుగోళ్లలో రికార్డుకు తెలంగాణ సన్నాహాలు.. కేంద్రం మద్దతు కోరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి!

  • Jubilee Hills Bypoll

    Jubilee Hills Byelection: అక్టోబర్ 4 లేదా 5న జూబ్లిహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్

Latest News

  • Indian Cricket: 15 ఏళ్ల‌లో ఇదే తొలిసారి.. దిగ్గజాలు లేకుండా గ్రౌండ్‌లోకి దిగిన టీమిండియా!

  • Donald Trump: మందుల‌పై 100 శాతం టారిఫ్‌.. ఇంకా ఎందుకు అమ‌లు కాలేదు?!

  • Kantara Chapter 1: కాంతార: చాప్టర్‌-1 రివ్యూ.. రిషబ్‌శెట్టి సినిమా ఎలా ఉందంటే?

  • ‎Curd with Chia Seeds: పెరుగులో చియా సీడ్స్ కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

  • ‎Moong Dal: వామ్మో.. ప్రతిరోజు పెసలు తింటే ఏకంగా అన్ని ప్రయోజనాలు కలుగుతాయా?

Trending News

    • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!

    • Vijayadashami: రేపే దసరా.. విజయదశమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

    • Economic Changes: నేటి నుండి అమలులోకి వచ్చిన 6 ప్రధాన ఆర్థిక మార్పులీవే!

    • Arattai App: ట్రెండింగ్‌లో అరట్టై.. ఈ యాప్ సీఈవో సంపాద‌న ఎంతో తెలుసా?

    • Suryakumar Yadav: చ‌ర్చ‌నీయాంశంగా సూర్య‌కుమార్ యాద‌వ్ వాచ్‌.. ధ‌ర ఎంతంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd