BRS Party: కదలరు, వదలరు.. నామినేటేడ్ పోస్టుల్లో కొనసాగుతున్న అధికారులు వీళ్లే!
బీఆర్‌ఎస్ పాలనలో ఎంపికైన నామినేటేడ్ అధికారులు పలువురు తమ పదవులను ఇంకా వదులుకోలేదు.
- By Balu J Published Date - 11:27 AM, Thu - 7 December 23

BRS Party: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్నప్పటికీ, బీఆర్‌ఎస్ పాలనలో ఎంపికైన నామినేటేడ్ అధికారులు పలువురు తమ పదవులను ఇంకా వదులుకోలేదు. R. శైలేష్ రెడ్డి జూలై 2016లో TSAT CEOగా నియమితులయ్యారు. TSAT అనేది నాణ్యమైన విద్యను అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన టి-హబ్ అక్టోబర్ 2021 నుండి శ్రీనివాస్ మహంకాళీ రావు నేతృత్వంలో కొనసాగుతోంది. దీప్తి రావుల WE హబ్ CEO. ఆమె ఫిబ్రవరి 2018 నుండి ఇప్పటి వరకు WE హబ్‌కి నాయకత్వం వహిస్తున్నారు.
ఎన్.వి.ఎస్. రెడ్డి, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్. అతను వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పదవీకాలాన్ని పొడిగించాయి. తెలంగాణ ప్రభుత్వం ఆయన సర్వీసును కనీసం మూడుసార్లు పొడిగించింది. ఈ అధికారులే కాకుండా ప్రధాన సలహాదారు సోమేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు ఎస్.కె. జోషి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఇంకా తమ పదవులను వదులుకోలేదు.
కార్పోరేషన్‌లకు నామినేట్ అయిన పలువురు ఇప్పటికే తమ రాజీనామా లేఖలను చీఫ్ సెక్రటరీ ఎ. శాంతికుమారికి సమర్పించారు. ఇందులో టిఎస్ ట్రాన్స్‌కో ఛైర్మన్ దేవులపల్లి ప్రభాకర్ రావు, టిఎస్ ప్లానింగ్ బోర్డు వైస్-ఛైర్మెన్ బి. వినోద్ కుమార్, ముఖ్యమంత్రి సిపిఆర్‌ఓ జ్వాల వంటి ప్రముఖులు ఉన్నారు.
Also Read: Dark Chocolate Benefits: డార్క్ చాక్లెట్ తినడం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!