HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >There Is A Lot Of Noise In Erravelli Kcr Bgbg With Activists And Fans

KCR: ఎర్రవెల్లిలో సందడే సందడి.. కార్యకర్తలు, అభిమానులతో కేసీఆర్ బిజీబిజీ

  • Author : Balu J Date : 26-06-2024 - 9:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr (2)

KCR: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తో కార్యకర్తలు అభిమానుల సందర్శన గత వారం రోజులుగా కొనసాగుతూనే ఉన్నది. తమ అభిమాన నేతను చూసేందుకు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున ఎర్రవెల్లి నివాసానికి తరలి వస్తున్నారు. వచ్చిన ప్రతి కార్యకర్తను అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ప్రత్యేక సమయాన్ని కేసీఆర్ కేటాయిస్తున్నారు. బుధవారం నాడు జనసందోహం తో ఎర్రవెల్లి పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. జై తెలంగాణ జై కేసీఆర్ నినాదాలు మారు మోగాయి. కేసీఆర్ నివాసం అభిమానుల తాకిడి తో కిక్కిరిసి పోయింది. కార్యకర్తలతో పాటు పలు నియోజక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్యే లు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎంఎల్సీలు, మాజీ చైర్మన్లు తదితర ముఖ్యనేతలు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధినేత తో నిత్యం సమావేశమౌతున్నారు. ఈ సందర్భంగా బుధవారం పలు నియోజక వర్గాలనుండి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు నాయకులతో వారి అభ్యర్థన మేరకు పార్టీ అధినేత కేసీఆర్ గారు ఫోటోలు దిగారు.

తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు నాయకులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ వారి నడుమ మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా దాదాపు ఐదు గంటలపాటు ఓపిక తో అధినేత సమయం కేటాయించారు.  నేపథ్యంలో బుధవారం నాడు కూడా అధినేత కేసీఆర్ తో పార్టీ కి చెందిన పలువురు ముఖ్యనేతలు సమావేశమైనారు. ఈ సందర్భంగా వారి కార్యకర్తలను తోడ్కొని పలు నియోజక వర్గాలనేతలు కేసీఆర్ గారికి పరిచయం చేస్తూ ఫోటోలు దిగారు.

అధినేత కేసీఆర్ ను కలిసి మర్యాదపూర్వకంగా సమావేశమైన వారిలో…సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు, బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,జమగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్సీ తాతా మధు, వనపర్తి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్,ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ,మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పార్టీ ముఖ్యనేతలు రాగిడి లక్ష్మారెడ్డి, సుధీర్ బాబు, కల్లుగీత కార్పోరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి గౌడ్, మాజీ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రజినీ సాయిచంద్,తదితర నియోజకవర్గాల ముఖ్యనేతలు..ఆయా జిల్లాల స్థానిక నాయకులు ఉన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS leader
  • kcr
  • meeting

Related News

Kcr Bday

KCR Birthday: కెసిఆర్ కు సీఎం రేవంత్ విషెష్ !! నా హీరో అంటూ కేటీఆర్ ట్వీట్ !

తెలంగాణ ఉద్యమ సారథి, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) 72వ పుట్టినరోజు వేడుకలు నేడు (ఫిబ్రవరి 17) రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి

    Latest News

    • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

    • AI Summit Delhi 2026: ఏఐ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు

    • పదేపదే ఆకలి అవుతుందా? అయితే కార‌ణాలివే!!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

    Trending News

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd