Rain Alert Today : ఇవాళ తేలికపాటి వానలే.. ఈ జిల్లాల్లో మాత్రం ఎక్కువ!
Rain Alert Today : ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
- By Pasha Published Date - 07:09 AM, Sat - 29 July 23

Rain Alert Today : ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అదిలాబాద్, నిర్మల్, కొమురం భీమ్, మంచిర్యాల జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు పడొచ్చు. రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల వానలు కురిసే అవకాశం ఉంది. వచ్చే 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ లో..
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 27 డిగ్రీలు, 22 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది.
Also read : Munagaku Pesarapappu : మునగాకు పెసరపప్పు కూర ఎలా తయారీ చేయాలో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ లో..
ఏపీలో నేటి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలోనూ వర్షాలు(Rain Alert Today) తగ్గుతాయి. రాష్ట్రమంతటా భారీ నుంచి అతిభారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్టేనని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం, ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని వాతావరణ విభాగం అధికారులు అన్నారు. దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే ఛాన్స్ ఉంది.