Maoists : మావోయిస్టులతో చర్చలు అనేది లేదు – బండి సంజయ్ స్పష్టం
Maoists : దేశ ప్రజల ప్రాణాలను బలిగొడుతున్న వారితో చర్చలు జరపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు
- By Sudheer Published Date - 12:53 PM, Sun - 4 May 25

కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మావోయిస్టుల(Maoists )పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల ప్రాణాలను బలిగొడుతున్న వారితో చర్చలు జరపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తుపాకీ చేతపట్టి అమాయకులను పొట్టన పెట్టుకుంటూ దేశంలో శాంతిని భంగం చేస్తున్న మావోయిస్టులతో ఏ విధమైన చర్చలు జరుగబోవని ఆయన తేల్చి చెప్పారు. ఇలాంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నవారితో మాట్లాడే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.
Water Attack : పాక్‌పై వాటర్ స్ట్రైక్.. బాగ్లిహార్ డ్యాం గేట్లు క్లోజ్
మావోయిస్టుల మూలాలను గుర్తు చేస్తూ బండి సంజయ్, ఈ విప్లవవాద గుంపును నిషేధించిన పార్టీయే కాంగ్రెస్ అని గుర్తు చేశారు. కేవలం బీజేపీనే కాకుండా, కాంగ్రెస్, టీడీపీ సహా అనేక రాజకీయ పార్టీలకు చెందిన నేతలను మావోయిస్టులు హతమార్చిన దారుణ చరిత్ర ఉందన్నారు. వారు అమాయకులను కాల్చి చంపడం వల్ల అనేక కుటుంబాలు తల్లడిల్లిపోయాయని, వారి చర్యలు దేశానికి తీవ్ర మానసిక నష్టాన్ని కలిగించాయని అభిప్రాయపడ్డారు.
తుపాకీని వీడి ప్రజాస్వామ్య మార్గాన్ని అనుసరించే వరకు మావోయిస్టులతో చర్చల గురించి అస్సలు ఆలోచించదని బండి సంజయ్ స్పష్టం చేశారు. దేశ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉండే వారితో మాత్రమే చర్చలు జరగవచ్చని తెలిపారు. ఇకపై ఉగ్రవాద విధానాలకు సహకరించేది లేదని ఆయన హెచ్చరించారు.