HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >The Meeting Concluded At Kharges Residence

ఖర్గే నివాసంలో ముగిసిన సమావేశం..కాసేపట్లో సీఎం ఎవరనేది ప్రకటన

సీఎం పదవి కోసం ఎక్కువ మంది ఆశిస్తుండటంతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆదివారం నుంచి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నది

  • Author : Sudheer Date : 05-12-2023 - 2:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kharge Rahul
Kharge Rahul

తెలంగాణ సీఎం (Telangana CM) ఎంపికపై కాంగ్రెస్‌ పార్టీలో తర్జనభర్జనలు నడుస్తూనే ఉన్నాయి. సీఎం పదవి కోసం ఎక్కువ మంది ఆశిస్తుండటంతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆదివారం నుంచి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నది. తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే (Mallikarjun Kharge) నివాసంలో కాంగ్రెస్‌ కీలక నేతలు సమావేశమయ్యారు. కొద్దీ సేపటి క్రితం ఈ సమావేశం ముగిసింది. ఉత్తమ్ (Uttam) , భట్టి (Bhatti) లతో విడివిడిగా చర్చలు జరిపారు. దాదాపు రెండు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. ప్రస్తుతం రాహుల్ (Rahul) బయటకు వచ్చినప్పటికీ ఇంకా ఖర్గే నివాసంలో డీకే తో పాటు పలువురు ఉన్నారు. ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ, జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించిన డీకే శివకుమార్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మానిక్‌రావు థాక్రే ఈ సమావేశంలో పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

సీఎం పదవి కోసం రేవంత్‌ రెడ్డితోపాటు సీనియర్‌ నేతలు మల్లు భట్టి విక్రామార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పోటీ పడుతున్నారు. దాంతో సోమవారం రాత్రి 8 గంటలకే జరుగుతుందనుకున్న సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఆగిపోయింది. ముగ్గురిలో ఒకరి పేరును ఖరారు చేయడం కోసం హైకమాండ్‌ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో విడివిడిగా సమావేశమైన డీకే.. ఇప్పుడు ఖర్గేతో భేటీయై నివేదికను సమర్పించారు. రేవంత్‌రెడ్డి వైపే మొగ్గుచూపుతున్న హైకమాండ్‌ ఈ సమావేశంలో చర్చ అనంతరం ఆయననే సీఎంగా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు డిప్యూటీ సీఎం విషయంలో మల్లు భట్టి విక్రమార్క సైతం కొన్ని షరతులు విధించడంతో దానిపై కూడా ఆయనను కన్విన్స్ చేస్తున్నారు.

ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఇలాంటి భిన్నాభిప్రాయాలు, అలకలు, కోరికలు చాలా సహజమని, ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితం కాదని ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలకు జరిగాయని, ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం ఏర్పడిందా అని ప్రశ్నించారు. బీజేపీ గెలిచిన మూడు రాష్ట్రాల్లో సైతం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎవరో తెలియలేదని, ఆ పార్టీకీ దానికుండే కష్టాలు ఉంటాయని, ఇవి పరిష్కారం లేని సమస్యలు కావని, సంక్షోభం అంతకంటే కాదన్నారు.

Read Also : KTR: రేపు రాష్ట్రవ్యాప్తంగా జనగామ జడ్పీఛైర్మన్ సంపత్‌రెడ్డికి నివాళులు అర్పించాలి – కేటీఆర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bhatti
  • congress
  • Kharge residence
  • revanth
  • Telangana New Cm
  • uttam

Related News

Survey

ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటికీ బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.

    Latest News

    • Budget 2026 – 27 : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన బడ్జెట్

    • Phone Tapping Case : నందినగర్ కు బయల్దేరిన కేసీఆర్‌

    • Budget 2026 : గుడ్ న్యూస్ ! హైదరాబాద్ కు 3 హైస్పీడ్ రైళ్లు – నిర్మలా సీతారామన్ ప్రకటన

    • కుప్పకూలుతున్న బంగారం , వెండి ధరలు

    • Budget 2026 : స్మోకింగ్ & గుట్కా ప్రియులకు షాక్

    Trending News

      • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

      • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

      • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

      • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

      • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd