HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >The High Court Expressed Its Anger Over The Increase In Movie Ticket Prices

సినిమా టికెట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

  • Author : Vamsi Chowdary Korata Date : 09-01-2026 - 5:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana High Court movie ticket price hike
Telangana High Court movie ticket price hike

Telangana High Court సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే ధరలు పెంచుతూ ప్రభుత్వాలు మెమోలు జారీ చేయడంపై న్యాయస్థానం అసహనం చెందింది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వినడం లేదని, ప్రజలపై ఆర్థిక భారం పడేలా నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించింది.

తెలంగాణలో భారీ బడ్జెట్ సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరల పెంపు అంశం ప్రహసనంగా మారిన సంగతి తెలిసిందే. రేట్లు పెంచాలని ప్రభుత్వానికి ఫిలిం మేకర్స్ దరఖాస్తు చేసుకోవడం, ధరలు పెంచుకోడానికి ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయడం, దానిపై ఎవరో ఒకరు కోర్టుకు వెళ్లడం, న్యాయస్థానం ఆ జీవోని సస్పెండ్ చేయడం.. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాల విషయంలో ఇదే ప్రక్రియ కనిపిస్తోంది. ‘ది రాజాసాబ్’ విడుదల నేపథ్యంలో మరోసారి ఈ అంశం రచ్చకెక్కింది. సినిమా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ మెమోలు జారీ చేయడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజాసాబ్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి వచ్చింది. నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టికెట్ రేట్లు పెంచుకోడానికి పర్మిషన్ ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దీంతో రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుబట్టింది. పదే పదే టికెట్ ధరలను ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంపై అసహనం వ్యక్తం చేసింది.

తెలంగాణాలో సినిమా టికెట్ల రేట్లు పెంచబోమని స్వయంగా సంబంధిత మంత్రి ప్రకటించినప్పటికీ, మళ్ళీ ధరల పెంపునకు అనుమతిస్తూ మెమోలు ఎలా జారీ చేస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా? తెలివిగా మెమోలు ఎందుకు జారీ చేస్తున్నారు? అని ప్రభుత్వ ప్లీడర్‌ను నిలదీసించింది. ఎన్నిసార్లు చెప్పినా మీ ఆలోచన ఎందుకు మారడం లేదంటూ మండిపడింది. ప్రజలపై ఆర్థిక భారం పడేలా తీసుకుంటున్న ఈ నిర్ణయాల వెనుక ఆంతర్యం ఏమిటి? మెమో ఇచ్చే అధికారికి రూల్స్ తెలియవా? అంటూ హైకోర్ట్ ప్రశ్నించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Movie Tickets Price Hike
  • Telangana High Court
  • Telangana High Court angry
  • The Raja Saab

Related News

Ias Srilakshmi

ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

IAS Sri Lakshmi  ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) అక్రమ మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు నుంచి తనను విముక్తి చేయాలని ఆమె దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. సీబీఐ

    Latest News

    • Half-Day Schools: తెలంగాణ లో ఒంటిపూట బడులు ఎప్పటి నుండి అంటే ..!!

    • Kiraak RP : కిరాక్ ఆర్పీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా..?

    • Parking : హైదరాబాద్ పార్కింగ్ కష్టాలకు పుల్ స్టాప్..ఏంచేయబోతున్నారంటే !!

    • అమీషా పటేల్ కి నాన్ బెయిలబుల్ వారెంట్

    • Tiger : తూర్పుగోదావరి జిల్లాలో పట్టుకున్న పులిని వదిలేశారా..? అదేంటి ?

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

      • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

      • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

      • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

      • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd