Thatikonda Rajaiah : మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కేసీఆర్ కీలక బాధ్యతలు
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించి.. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్‌ను గెలిపించాలని రాజయ్యకు కేసీఆర్ సూచించారు
- Author : Sudheer
Date : 14-04-2024 - 9:48 IST
Published By : Hashtagu Telugu Desk
స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah)కు బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ (KCR) కీలక బాధ్యతలు అప్పగించారు. ఆదివారం ఫాం హౌజ్‌లో రాజయ్య..కేసీఆర్ ను కలిశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించి.. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్‌ను గెలిపించాలని రాజయ్యకు కేసీఆర్ సూచించారు. కష్టపడేవారిని పార్టీ గుర్తింపు నిస్తుందని, గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకోవద్దని, జిల్లాలో నేతలు పార్టీని వీడినంత మాత్రానా నష్టం ఏమీలేదని, కేడర్ బలంగా ఉందని అందరూ సమిష్టిగా పనిచేయాలని కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదన్నారు. కడియం, దానం, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలని రాజయ్యకు కేసీఆర్ సూచించారు.
Read Also : Pawan Kalyan : టెన్త్ క్లాస్ పరీక్ష పత్రాలు లీక్ చేసిన మహానుభావుడు ముఖ్యమంత్రి జగన్..