TGRTC : బస్సు చార్జీలు పెంచిన టీజీఎస్ఆర్టీసీ
టికెట్ ఛార్జీల్లో చేర్చిన టోల్ ఫీజును రూ.3 పెంచింది. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.10 నుంచి రూ.13, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో రూ.13 నుంచి రూ.16, గరుడ ప్లస్ బస్సుల్లో రూ.14 నుంచి రూ.17
- By Sudheer Published Date - 09:03 PM, Wed - 12 June 24

టీజీఎస్ఆర్టీసీ (TGRTC) ఆర్టీసీ చార్జీలు (Bus charges) పెంచిందా..? అంటే అవుననే తెలుస్తుంది. తాజాగా కేంద్రం.. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్‌గేట్ల వద్ద చార్జీలు స్వల్పంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ టికెట్ చార్జీలు సైతం యాజమాన్యం పెంచింది. టోల్ ప్లాజాలు ఉన్న రూట్లలో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు పెంచడం జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
టికెట్ ఛార్జీల్లో చేర్చిన టోల్ ఫీజును రూ.3 పెంచింది. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.10 నుంచి రూ.13, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో రూ.13 నుంచి రూ.16, గరుడ ప్లస్ బస్సుల్లో రూ.14 నుంచి రూ.17, గరుడ ప్లస్ బస్సుల్లో రూ.14 నుంచి రూ.17. నాన్-ఎసి స్లీపర్, హైబ్రిడ్ స్లీపర్ బస్సులలో 15 నుంచి రూ.18కి, ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ.20 నుంచి రూ.23కి.పెరిగిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. అయితే చార్జీలు పెంచిన విషయం ఎక్కడ తెలుపకుండా డైరెక్ట్ గా అమల్లోకి తీసుకరావడం తో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మగవారు చార్జీల పెంపు ఫై మండిపడుతున్నారు. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి మాకు కనీసం సీట్లు లేకుండా చేస్తున్నారని..ఇప్పుడు టికెట్ ధరలు పెంచి మాపై మరికొంత భారం మోపిందని వాపోతున్నారు.
Read Also : Mega Vs Allu : అల్లు ఫ్యామిలీ ని మెగా ఫ్యామిలీ దూరం పెడుతుందా..?