CM Revanth Reddy : విద్యుత్ ఉద్యోగులు సైతం ఆందోళనలు మొదలుపెట్టారు
ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్, ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థలను ప్రయివేటు పరం చేయద్దంటూ వారంతా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు
- By Sudheer Published Date - 09:05 PM, Thu - 11 July 24

ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణలో ఉద్యమాలు మళ్లీ మొదలయ్యాయి. గ్రూప్-2, DSC పరీక్షలను వాయిదా వేయాలంటూ విద్యార్థులు, నిరుద్యోగులు గత కొద్ది రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితి తెలంగాణ ఉద్యమం నాటి పాత రోజులను గుర్తుకు తెస్తోంది. నిరుద్యోగుల ఆందోళనలను పరిష్కరించి ప్రభుత్వం యువతలో శాంతిని నింపుతుందా? లేక పంతానికి పోతే ఈ ఉద్యమాలు మరింత ఉద్ధృతంగా మారుతాయా? అని అంత మాట్లాడుకుంటుండగా..వీరికి తోడుగా పలు ఉద్యోగ సంఘాలు బరిలోకి దిగుతున్నాయి. తాజాగా విద్యుత్ ఉద్యోగులు సైతం రేవంత్ రెడ్డి సర్కార్ కు వ్యతిరేకంగా గళం విప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్, ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థలను ప్రయివేటు పరం చేయద్దంటూ వారంతా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. విద్యుత్ సంస్థలను అదానీకి, అంబానీకి కట్టబెడుతామంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లోని 55 వేల మంది ఉద్యోగులు చూస్తూ ఊరుకోరని ఈ ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. పోరాటాలకు మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించింది. హైదరాబాద్‌లోని ఎస్‌పీడీసీఎల్ కార్యాలయం ముందు గురువారం విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా చేశారు. రేవంత్ రెడ్డికి, అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో ఉన్న సీఈవోలకు మధ్య జరిగిన ఒప్పందం ఏంటి..? దావోస్‌లో, ఢిల్లీలో జరిగిన ఒప్పందాలను బయటపెట్టాలని వారు డిమాండ్ చేసారు. ఇదేదో రహస్య డాక్యుమెంట్ కాదు. ఇది పబ్లిక్ ప్రాపర్టీ. ఎస్సీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్, ట్రాన్స్‌కో, జెన్‌కో అయినా.. ప్రజల ఆస్తి. నాలుగు కోట్ల మంది కట్టిన కరెంట్ బిల్లులతో సంపాదించిన ఆస్తులు ఇవి. అలాంటి ఆస్తులను అదానీకి, అంబానీకి, ఇంకొకరికి ఇస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
Read Also : Talliki Vandanam : తల్లికి వందనం పథకానికి మార్గదర్శకాలు