TGRTC : ఆర్టీసీ ప్రతిష్ట దెబ్బ తీయాలని చూస్తే ఊరుకునేది లేదు – సజ్జనర్ హెచ్చరిక
నగరంలోని సిటీ బస్సు రాగానే ఎదురెళ్లిన ఆ యువకుడు ఒక్కసారిగా రోడ్డుపై పడుకున్నాడు. అయితే అతను పడుకుని ఉండడంతో బస్సు అతని మీద నుంచి వెళ్ళిపోయింది
- By Sudheer Published Date - 08:30 PM, Fri - 21 June 24

ఇటీవల కాలంలో యువత రీల్స్ (Reels) అంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతి రోజు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. వ్యూస్ కోసం..రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రవర్తిస్తున్నారు. ఇదే క్రమంలో కొన్ని ఫేక్ వీడియోస్ కూడా హల్చల్ చేస్తున్నాయి. తాజాగా TGRTC బస్సు కింద ఓ యువకుడు పడినట్లు ఓ వీడియో వైరల్ గా మారడం తో దానిపై ఆర్టీసీ MD సజ్జనార్ స్పందించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ వీడియో లో నగరంలోని సిటీ బస్సు రాగానే ఎదురెళ్లిన ఆ యువకుడు ఒక్కసారిగా రోడ్డుపై పడుకున్నాడు. అయితే అతను పడుకుని ఉండడంతో బస్సు అతని మీద నుంచి వెళ్ళిపోయింది. బస్సు అతని మీద నుంచి వెళ్లగానే లేచి పక్కకు వెళ్ళిపోయాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఫై తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనర్ స్పందించారు. ఇది ఫేక్ అని., ఇది పూర్తిగా ఎడిట్ చేసిన వీడియో ఉంటూ తెలిపారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొందరు అతిగా ఆలోచించి ఇలా వీడియోలను ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నారని.. ఇలాంటి వెకిలి చేష్టలు చేయడం వల్ల ఆర్టీసీ ప్రతిష్ట దెబ్బ తీసే ప్రయత్నం చేయడం మంచిది కాదని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలను సరదా కోసం ఎడిట్ వీడియోలు ఇతరులకు ప్రాణాపాయం కూడా కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలపై తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుందని., ఇలాంటి వీడియోలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో ఫేక్. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో. సోషల్ మీడియాలో పాపులర్ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్ చేసి వదులుతున్నారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు. లైక్ లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా… pic.twitter.com/Eia1GCSxyr
— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) June 21, 2024
Read Also : Mahesh Babu : రాజమౌళి తర్వాత మళ్లీ త్రివిక్రం తోనే సూపర్ స్టార్..?