HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tg Govt Good News For Landless Poor Families

Telangana Govt Good News : సంక్రాంతి సంబరాలకు తెలంగాణ సర్కార్ సిద్ధం..

Telangana Government : సంక్రాంతిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరింత సంబరంగా , సంతోషంగా జరుపుకునేలా సీఎం రేవంత్ సరికొత్త పథకాలను సంక్రాంతి సందర్బంగా అందజేయబోతున్నారు

  • Author : Sudheer Date : 17-12-2024 - 7:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tggovtpongal
Tggovtpongal

తెలంగాణ సర్కార్ (Telangana Government ) సంక్రాంతి (Sankranthi) సంబరాలకు సిద్ధం అవుతుంది. సంక్రాంతి అంటే తెలుగు ప్రజలకు పెద్ద పండగ. ఈ పండగను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు సైతం ఎంతో సంబరంగా జరుపుకుంటుంటారు. అలాంటి సంక్రాంతిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరింత సంబరంగా , సంతోషంగా జరుపుకునేలా సీఎం రేవంత్ (CM Revanth) సరికొత్త పథకాలను సంక్రాంతి సందర్బంగా అందజేయబోతున్నారు. రాష్ట్రంలోని పేదలకు ఆర్థిక సహాయం, రేషన్ కార్డుల పంపిణీ వంటి పథకాలను అమలు చేయనున్నట్లు సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ముఖ్య నిర్ణయాల్లో భూమిలేని పేదలకు ప్రతి ఏడాది రూ. 12,000 ఆర్థిక సహాయం అందించడం ఒకటి. రైతులకు మాత్రమే కాకుండా భూమిలేని వారి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28న ఈ పథకాన్ని ప్రారంభించి పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా అందనుంది.

సంక్రాంతి కి రేషన్ కార్డుల సమస్యకు కూడా తెలంగాణ ప్రభుత్వం పరిష్కారం చూపనుంది. సుమారు 30 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. గతంలో అర్హత ఉన్నా రేషన్ కార్డులు లేని కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇటీవల జరిగిన కుటుంబ సర్వే ద్వారా ఈ అంశం ప్రభుత్వం దృష్టికి రావడంతో సంక్రాంతి తర్వాత ఈ కార్డులను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.రైతుల కోసం మరోసారి రైతు బంధు పథకాన్ని విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రుణమాఫీతో పాటు రైతు బంధు పథకం ద్వారా రైతుల కష్టాలను తీరుస్తామని తెలిపారు. వ్యవసాయం ప్రధాన ఆధారంగా ఉన్న తెలంగాణలో సంక్రాంతి పండుగ రైతులకు పంటల పండుగగా నిలుస్తుంది. ఈ పథకాల ద్వారా రైతన్నలలో చిరునవ్వులు పూయాలని ప్రభుత్వం సంకల్పించింది. మొత్తానికి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం పేదలు, రైతులు, సామాన్య ప్రజలకు వరాల జల్లు కురిపిస్తోంది.

Read Also : Congress : 19న కాంగ్రెస్‌ ఎంపీలతో రాహుల్‌గాంధీ భేటీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • Landless poor families
  • sankranthi
  • telangana government
  • Telangana Government Good News

Related News

Vakiti Srihari fish curry Midday meal scheme

Midday meal scheme: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మధ్యాహ్న భోజనంలో చేపల కూర: మంత్రి వాకిటి శ్రీహరి

Government Schools  తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక తీపి కబురు అందించింది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో పాటు పౌష్టికాహారం అందిస్తుండగా, ఇకపై ఆ మెనూలో చేపల కూరను కూడా చేర్చనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అసెంబ్లీలో వెల్లడించారు. సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మ

  • Telangana Congress Coordina

    TG Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త అధ్యాయం

  • Harish Rao Kanchukota

    Siddipet : హరీష్ రావు కంచుకోటాను కదిలించే దమ్ము రేవంత్ కు ఉందా ?

  • Cm Revanth Reviews Preparat

    Telangana Cabinet : క్యాబినెట్ లో మార్పులు చేస్తే రేవంత్ కు తలనొప్పి తప్పదా ?

  • MLC Elections

    Jeevan Reddy : ఎంతమంది బుజ్జగించిన తగ్గేదేలే అంటున్న జీవన్ రెడ్డి

Latest News

  • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

  • కనిష్ట స్థాయికి ప‌డిపోయిన రూపాయి విలువ‌!

  • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

  • TVK Candidate List 2026 : త్రిష చెప్పిన వారికే విజయ్ టికెట్స్ ఇచ్చాడా ?

  • ఈటీవీ భార‌త్ సంస్థ‌కు క్ష‌మాప‌ణ‌లు!

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd