GHMC : చెవి కత్తిరించని కుక్కలు కనిపిస్తే చెప్పేయండి..
సంతాన నిరోధక ఆపరేషన్లు చేసిన కుక్కల చెవులను ‘వీ’ ఆకారంలో కత్తిరించామని తెలిపింది.
- By Pasha Published Date - 09:50 AM, Mon - 19 August 24

GHMC : మీ ఏరియాలో చెవి కత్తిరించని కుక్కలు ఉన్నాయా ? ఒకవేళ అలాంటి కుక్కలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కోరుతోంది. సంతాన నిరోధక ఆపరేషన్లు చేసిన కుక్కల చెవులను ‘వీ’ ఆకారంలో కత్తిరించామని తెలిపింది. ఏవైనా కుక్కలకు చెవులు కత్తిరించి లేకుంటే తమకు సమాచారం ఇవ్వాలని, తాము వాటికి సంతాన నిరోధక సర్జరీలు చేయిస్తామని వెల్లడించింది. చెవి కత్తిరించని కుక్కలు కనిపిస్తే తమకు ‘మై జీహెచ్‌ఎంసీ’ మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కోరారు. ఈమేరకు ఎస్ఎంఎస్ రూపంలో గ్రేటర్ హైదరాబాద్(GHMC) పరిధిలోని 20లక్షల ఫోన్ నంబర్లకు ఆమె మెసేజ్ పంపారు. ‘మై జీహెచ్‌ఎంసీ’ మొబైల్ యాప్‌లో ‘వెటర్నరీ గ్రీవెన్స్’ లింక్‌ను క్లిక్ చేసి చెవి కత్తిరించని కుక్కల ఫొటోలు, ఏరియా పేర్లను పంపాలని కోరారు. హైదరాబాద్ పరిధిలో కుక్కల సంఖ్య బాగా పెరిగిపోయింది. చాలామంది కుక్కకాటుకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈవిధంగా చికిత్సపొందుతూ కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు.
We’re now on WhatsApp. Click to Join
కుక్కల గురించి ఆసక్తికర విషయాలు
- కుక్కల వాసన జ్ఞానం మనుషుల కంటే 40 రెట్లు పెద్దది. వీటి ముక్కు మిలియన్ల సువాసన గ్రాహకాలను కలిగి ఉంటుంది. అందుకే మనుషులు గుర్తించలేని డ్రగ్స్, డెడ్ బాడీలు, బెడ్ బగ్స్, పేలుడు పదార్థాల వాసనలను కుక్కలు గుర్తించగలవు.
- ఏ రెండు కుక్కల ముక్కులు అచ్చం ఒకేలా ఉండవు. కుక్క ముక్కు మానవ వేలిముద్రతో సమానం.
- కుక్కలు కూడా మనుషుల లాగే నిద్రలో కలలు కంటాయట. ఆడుకోవడం గురించి, తమ తోకను వెంబడించడం గురించి అవి కలలు కంటాయట.
Also Read :Indian Spices : భారత సుగంధ ద్రవ్యాల నాణ్యతపై మరో సంచలన నివేదిక
- మీ కుక్క ఉత్సాహంగా తోకను ఊపుతుంటే, దానికి మిమ్మల్ని చూస్తే సంతోషం కలిగిందని అర్థం.
- నవజాత కుక్కలకు చెవులు వినిపించవు. కండ్లు కూడా మూసేసే ఉంటాయి.
- చాలా నవజాత కుక్కపిల్లలు రెండు వారాల తర్వాతే కళ్లు తెరిచి శబ్దాలకు స్పందిస్తాయి.